Kavitha: తెలంగాణకు మీరు సీఎం అవుతారు..!
ABN , Publish Date - May 13 , 2025 | 04:12 AM
ఎమ్మెల్సీ కవిత తెలంగాణకు సీఎం అవుతారని సోదమ్మలు జోస్యం చెప్పారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజపురం శివారులో సోమవారం జరిగిన నాంచారమ్మ కల్యాణంలో కవిత పాల్గొన్నారు.
నాంచారమ్మ జాతరలో కవితకు సోదమ్మల జోస్యం
వెంకటాపూర్, మే 12 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ కవిత తెలంగాణకు సీఎం అవుతారని సోదమ్మలు జోస్యం చెప్పారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజపురం శివారులో సోమవారం జరిగిన నాంచారమ్మ కల్యాణంలో కవిత పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాంచారమ్మ వేషధారణలో వచ్చిన బాలికలతో కవిత సోది చెప్పించుకున్నారు. భవిష్యత్తులో మీరే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారని చిన్నారులు అనడంతో ఆ మాటలను కవిత చిరునవ్వుతో ఆలకించారు.
అంతకుముందు ఆమె రామప్ప ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. కాగా, ‘‘ఆరు నెలలు జైల్లో ఉన్నది చాలలేదా..? నన్ను ఇంకా కష్టపెడతారా..?’’ అని కవిత ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎ్‌సపై ప్రజల్లో ఆదరణ, నమ్మకం పెరుగుతోందని.. ఇలాంటి తరుణంలో తనపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు..
భూ భారతి చట్టం రైతులకు రక్షణ కవచం..
For More AP News and Telugu News