Share News

Migrant Voters in Jagityal: వలస ఓటర్లపై పంచాయతీ అభ్యర్థుల నజర్

ABN , Publish Date - Dec 06 , 2025 | 07:27 AM

పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే.. సర్పంచ్, వార్డు మెంబర్‌గా ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన అభ్యర్థులూ ఉన్నారు. దీంతో ఇంటింటి ప్రచారంతో ఒకవైపు గ్రామంలో నివాసముంటున్న ఓటర్లను అభ్యర్థులు ఆకర్షిస్తున్నారు. మరోవైపు వలస ఓటర్లపై దృష్టి సారిస్తున్నారు. ఒక్క ఓటు కూడా చేజారిపోకుండా ముందుగా జాగ్రత్త పడుతున్నారు.

Migrant Voters in Jagityal: వలస ఓటర్లపై పంచాయతీ అభ్యర్థుల నజర్
Migrant Voters in Jagityal

జగిత్యాల, డిసెంబరు 06: పల్లెల్లో ఎక్కడచూసినా ఎన్నికల హడావుడి.. రచ్చబండల వద్ద జోరుగా చర్చ జరుగుతోంది(Local Body Elections). పంచాయతీ సమరంలో ప్రతీ ఓటు కీలకం కావడంతో అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. విజయం తమనే వరించాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇంటింటి ప్రచారంతో ఒకవైపు గ్రామంలో నివాసముంటున్న ఓటర్లకు గాలం వేస్తున్నారు(Migrate Voters). పోలింగ్‌కు వచ్చేలా పల్లె నాయకులు, స్థానిక పెద్దలు ఫోన్లు చేస్తూ వలస ఓటర్లను రప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లోని ఓటర్లను దగ్గరుండి పల్లెకు రప్పించేందుకు ప్రత్యేకంగా మనుషులను కేటాయించడంపై దృష్టి సారించారు. అవసరమైతే ఓటుకు రేటుకట్టి మరీ పల్లెకు చేరుకునేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఉపాధి నిమిత్తం పలు పల్లెల యువతీ యువకులు పట్టణాలతో పాటు హైదరాబాద్, ముంబయి, బీవండి, పుణే, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లిన గ్రామాలకు చెందిన వ్యక్తుల ఓట్లను రాబట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


అన్నా.. తప్పక రావాలే..

జగిత్యాల(Jagtial) జిల్లాలోని 20 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 385 పంచాయతీలు, 3,596 వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 6,07,263 మంది పంచాయతీ ఓటర్లున్నారు. ఇందులో 2,89,702 మంది పురుషులు, 3,17,552 మంది స్త్రీలు, తొమ్మిది మంది ఇతరులున్నారు. 3,536 జంబో వ్యాలెట్ బాక్సులు, 1,428 సాధారణ బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. జిల్లాలో తొలి విడతలో 122 సర్పంచ్ 1172 వార్డులకు, రెండో విడతలో 144 సర్పంచ్ 1276 వార్డులకు, మూడో విడతలో 119 సర్పంచ్ 1,088 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.


సోషల్ మీడియాలో సందేశాలు..

పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటర్లతో పాటు ఉపాధి నిమిత్తం పట్టణాలకు వెళ్లిన ఓటర్లు సైతం కీలకమవుతున్నారు. అన్నా.. హైదరాబాద్‌(Hyderabad)లో ఉన్న మనోడు వచ్చడా? ముంబయి, భీవండి నుంచి ఎప్పుడు బయలుదేరుతున్నారంటూ అభ్యర్థులు వాకబు చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెళ్లి ఆహ్వాన పత్రాలు పంపినట్లుగా వాట్సాప్ గ్రూపుల్లో ఓటర్లకు తమ అభ్యర్థి తరపున సందేశాలు పంపిస్తున్నారు. 'అన్నా పోలింగ్ రోజు తప్పకుండా గ్రామానికి రావాలి. మీ అమూల్యమైన ఓటు వేయాలి' అంటూ మెసేజ్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అభ్యర్థులు ముహుర్తాలు చేసుకుని పట్నం బయలుదేరి ఊరి ఓటర్లు ఉన్న కాలనీలకు వెళ్లి.. సమావేశాలతో వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు... ఎక్కడ ఉంటున్నారు... ఎప్పుడు వస్తారు.. ఎలాంటి వాహనాలు ఏర్పాటుచేయాలి.. అనేపనిలో అభ్యర్థుల అనుచరులు నిమగ్నమయ్యారు. మరికొంత మంది.. అభ్యర్థులు తమ ఓటర్లకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మద్దతు కోరుతున్నారు. వలసల పెరుగుదలతో ఇప్పుడు గ్రామ రాజకీయాల్లో(Village Politics) పట్నం ఓటర్ల ప్రభావం పెరిగింది.


విందులే విందులు..

గ్రామాల్లో సర్పంచ్(Sarpanch Elections) ఎన్నికల సందడి జోరందుకుంటోంది. అభ్యర్ధుల ఇళ్లలో హడావుడితో పాటు బయట కూడా అదే ఉత్సాహం కనిపిస్తోంది. హైదరాబాద్, భీవండి, నిజామాబాద్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఉన్న గ్రామ ఓటర్లను తీసుకొచ్చేందుకు ప్రత్యేక ట్రావెల్స్ బస్సులు, కార్లను ముందస్తుగా బుక్ చేస్తున్నారు. పోలింగ్ రోజున సుదూర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకొచ్చే వాహనాలు ఆలస్యం కాకుండా ముందస్తుగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు.


ఇవీ చదవండి:

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ.. ఎందుకంటే

నా వ్యాఖ్యలపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్

Updated Date - Dec 06 , 2025 | 08:39 AM