Share News

TG News: గాడిదకు కౌశిక్ రెడ్డి ఫోటో.. వైరల్

ABN , Publish Date - Jan 13 , 2025 | 01:46 PM

Telangana: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనుచరులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా సమావేశంలో సంజయ్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దాడిని తప్పు బట్టారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.

TG News: గాడిదకు కౌశిక్ రెడ్డి ఫోటో.. వైరల్
Sanjay Vs kaushikreddy

జగిత్యాల జిల్లా, జనవరి 13: కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి (BRS MLA Padikaushikreddy), సంజయ్‌ కుమార్‌ (MLA Sanjay kumar) ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం సంచలనంగా మారింది. సమావేశంలో మైక్‌లో మాట్లాడుతున్న సంజయ్‌ను కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. నువ్వు ఏ పార్టీ అని.. దమ్ముంటే కాంగ్రెస్‌పై గెలవాలని పట్టుబడ్డారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో సమీక్షా సమావేశం గందరగోళంగా మారింది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.


అయితే సమావేశంలో సంజయ్‌పై కౌశిక్ రెడ్డి దాడి చేయడంపై సంజయ్ అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా వినూత్నంగా నిరసనకు దిగారు. కరీంనగర్ సమావేశంలో సంజయ్‌పై కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తను నిరసనగా.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఫోటోను గాడిదకు కట్టి ఊరేగించారు ఎమ్మెల్యే సంజయ్ అనుచరులు. పాడి కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు. తనపై దురుసుగా ప్రవర్తించాడని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. తన హక్కులకు భంగం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరికాసేపట్లో ఫిర్యాదుపై కరీంనగర్‌లో మీడియాతో ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడనున్నారు.

BR Naidu: వాస్తవాలు తెలుసుకుని రాయండి


కాగా.. కౌశిక్ రెడ్డికి పోలీసులు కూడా బిగ్ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యేపై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదు చేశారు. కరీంనగర్ ఆర్డీవో, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏల ఫిర్యాదు పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఆయనపై బీఎన్ఎస్ యాక్టు 132, 115 (2), 352,292 కింద కేసులు నమోదు అయ్యాయి. అయితే మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సమక్షంలో జరిగిన కరీంనగర్ జిల్లా సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహించిన తీరుపై మంత్రులు కూడా అసహనం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తీరును వారు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై దాడి సరైంది కాదని.. కౌశిక్ రెడ్డి ప్రవర్త ఏమాత్రం బాగోలేదని వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

ఈ రాశి వారికి షాపింగ్‌, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి

Hyderabad: పండగపూట నిలిచిన నీటి సరఫరా.. ఇబ్బందులు తప్పవా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 13 , 2025 | 01:49 PM