Kavitha: తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదు..
ABN , Publish Date - Sep 18 , 2025 | 07:14 AM
తెలంగాణను భారత్‌లో తామే విలీనం చేశామంటూ పీసీసీ ప్రెసిడెంట్ మహే్‌షగౌడ్ మాట్లాడుతున్నారని, అయితే కాంగ్రెస్ చేసిందేమీ లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ సిటీ: తెలంగాణను భారత్‌లో తామే విలీనం చేశామంటూ పీసీసీ ప్రెసిడెంట్ మహే్‌షగౌడ్ మాట్లాడుతున్నారని, అయితే కాంగ్రెస్ చేసిందేమీ లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) అన్నారు. భారత్‌లో తన సంస్థానాన్ని సెప్టెంబరు 17న విలీనం చేస్తానని అప్పటి ముస్లిం రాజు ప్రకటించారని, అయినప్పటికీ ఆపరేషన్ పోలో పేరుతో భారత సైన్యాన్ని ఇక్కడికి రప్పించడంతో ఎంతోమంది చనిపోయారని అన్నారు.

బంజారాహిల్స్ తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జనగాం ప్రాంతానికి చెందిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు ఎంకే మొయినుద్దీన్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సెప్టెంబరు 17 తెలంగాణ విలీన దినోత్సవమేనని స్పష్టం చేశారు.
విమోచన దినోత్సవమంటూ ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతుందన్నారు. మోదీ మీద ప్రేమ లేకపోతే తప్పుడు ప్రచారం ఆపాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..ఏ నగరాల్లో ఎలా ఉన్నాయంటే
Read Latest Telangana News and National News