Kalvakuntla Kavitha: నిరుద్యోగుల ఉసురుపోసుకోవద్ద..
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:44 PM
కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్-1 అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతూ వారు ఉసురుపోసుకోవద్దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద గ్రూప్-1 అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల త్యాగఫలితమే ప్రత్యేక తెలంగాణ అని గుర్తు చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్-1 అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతూ వారు ఉసురుపోసుకోవద్దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) అన్నారు. గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద గ్రూప్-1 అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల త్యాగఫలితమే ప్రత్యేక తెలంగాణ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంతానికి పోయి గ్రూప్-1 అభ్యర్థుల ఉద్యోగాల విషయంలో డివిజన్ బెంచ్ హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టుకు వెళ్లి బేషజాలకు పోవద్దన్నారు. ప్రభుత్వం చేసిన నియామక ప్రక్రియలో ప్రతి అడుగులో తప్పులు ఉన్నాయని విమర్శించారు.
ప్రిలిమ్స్ పరీక్షల నుంచే అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌లో పర్యటించి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం పారదర్శకంగా పరీక్షలు పెట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అమలు చేయడంలో విఫలమైందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ఉద్యోగాలను ఇచ్చి కొత్త ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగులు, విద్యార్థులను మోసం చేస్తోందన్నారు.

ఈ విషయంలో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడాలన్నారు. మిమ్మల్ని చూసి విద్యార్థులు, నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, వారికి అన్యాయం చేయవద్దన్నారు. కోర్టుల్లో నిరుద్యోగుల ఆవేదనను జడ్జ్జీలకు అర్ధమయ్యేలా పోరాటం చేస్తామన్నారు. గ్రూప్-1 నియామకాలు రద్దు చేసి మళ్లీ కొత్త పరీక్షలు నిర్వహించాలని ఆమె డి మాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగులు, జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భారత్ దాల్.. అంతా గోల్‌మాల్!
Read Latest Telangana News and National News