Justice P.C. Ghose: తుది అంకానికి కాళేశ్వరం కమిషన్ విచారణ
ABN , Publish Date - Jun 03 , 2025 | 04:26 AM
కాళేశ్వరం కమిషన్ విచారణ తుది అంకానికి చేరుకుంది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ తుది విచారణలో భాగంగా ఈనెల 4న హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
4న హైదరాబాద్‌కు జస్టిస్ పీసీ ఘోష్
హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం కమిషన్ విచారణ తుది అంకానికి చేరుకుంది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ తుది విచారణలో భాగంగా ఈనెల 4న హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఈ దఫా విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ఈనెల 6న మాజీ మంత్రి ఈటల రాజేందర్, 9న మాజీ మంత్రి హరీశ్‌రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరవుతారు.
ఈనెల 5వ తేదీన కేసీఆర్ కమిషన్ ఎదుట హాజరుకావాల్సి ఉండగా... మరింత సమయం కావాలని చేసిన విజ్ఞప్తి మేరకు ఈనెల 11వ తేదీకి విచారణను వాయిదా వేస్తూ కమిషన్ నోటీసులు పంపింది. నివేదిక అందించడానికి కమిషన్‌కు జూలై నెలాఖరు వరకు ప్రభుత్వం గడువు విధించిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి
బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..
చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..
Read Latest Telangana News And Telugu News