Trains: నెల రోజుల పాటు కాచిగూడ-నిజామాబాద్ డెమూ రైళ్లు రద్దు
ABN , Publish Date - Mar 01 , 2025 | 10:57 AM
కాచిగూడ-నిజామాబాద్(Kacheguda-Nizamabad) మధ్య నడిచే (77601/77602)డెమూ రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు దాకా రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది.
హైదరాబాద్ సిటీ: కాచిగూడ-నిజామాబాద్(Kacheguda-Nizamabad) మధ్య నడిచే (77601/77602)డెమూ రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు దాకా రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్ సెక్షన్‌లో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్(CPRO Sridhar) తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: CV Anand: కమిషనర్ సీరియస్ వార్పింగ్.. అక్రమార్కులపై ఉక్కుపాదం
ఇంటర్‌సిటీ ఎక్స్ప్రెస్కు అదనంగా ఏసీ చైర్‌కార్

లింగంపల్లి-విజయవాడ(Lingampalli-Vijayawada) మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (ఎంప్లాయీస్ ట్రైన్)కు అదనంగా మరొక ఏసీ చైర్‌కార్‌ను జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. శనివారం విజయవాడ నుంచి లింగంపల్లి వచ్చే (12795) ఎక్స్‌ప్రె్‌సలో, ఆదివారం లింగంపల్లి నుంచి విజయవాడ వెళ్లే (12796) ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అదనపు ఏసీ చైర్‌కార్ 15రోజుల పాటు అందుబాటులో ఉంటుందని సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదు
ఈవార్తను కూడా చదవండి: ఆధార్ లేకున్నా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం
ఈవార్తను కూడా చదవండి: స్వయం ఉపాధి పథకాలకు రుణాలివ్వండి
ఈవార్తను కూడా చదవండి: ‘కింగ్ ఫిషర్’ తయారీని పరిశీలించిన మహిళా శిక్షణ కానిస్టేబుళ్లు
Read Latest Telangana News and National News