Justice N V Ramana: జస్టిస్ ఎన్వీ రమణ ప్రజల న్యాయమూర్తి
ABN , Publish Date - May 08 , 2025 | 04:59 AM
జస్టిస్ ఎన్వీ రమణ ప్రజల న్యాయమూర్తి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా మరికొద్ది రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ బీఆర్ గవాయ్ కొనియాడారు.
కాబోయే సీజేఐ బీఆర్ గవాయ్ వ్యాఖ్య
జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగాల సంకలనం ఆవిష్కరణ
న్యూఢిల్లీ, మే 7(ఆంధ్రజ్యోతి): జస్టిస్ ఎన్వీ రమణ ప్రజల న్యాయమూర్తి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా మరికొద్ది రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ బీఆర్ గవాయ్ కొనియాడారు. సీజేఐగా ఎన్వీ రమణ సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ప్రజలకు దూరంగా ఉండిపోవడం కాకుండా వారితో కలిసిపోయి వారి సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ఎన్వీ రమణ పనిచేశారని చెప్పారు. బుధవారం ఢిల్లీ హైకోర్టు ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగాల సంకలనం ‘నారటివ్స్ ఆఫ్ ద బెంచ్ : ఏ జడ్జ్ స్పీక్స్’ పుస్తకాన్ని జస్టిస్ గవాయ్ ఆవిష్కరించారు. తాను, ఎన్వీ రమణ, మరికొందరు న్యాయమూర్తులు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చామని, అందుకే తమకు ప్రజల సమస్యలు తెలుసని చెప్పారు.
న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం ఎన్వీ రమణ ఎంతో కృషి చేశారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిది మంది మహిళ న్యాయమూర్తులను సుప్రీంకోర్టుకు నియమించిన ఘనత ఆయనకే దక్కిందని కొనియడారు. జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ అంటే వివాదాలను పరిష్కరించే సంస్థ కాదని, అది రాజ్యాంగ నైతికతకు చిహ్నమని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం ఉన్నంతకాలమే న్యాయ వ్యవస్థ సజీవంగా ఉంటుందని, న్యాయ వ్యవస్థపై దాడులు చేయడం వల్ల ప్రజలు విశ్వాసం కోల్పోయే అవకాశం ఉందన్నారు.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News