Share News

I Bomma Website: ఐ-బొమ్మ నిర్వాహకుడు అరెస్ట్

ABN , Publish Date - Nov 15 , 2025 | 09:54 AM

ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని కూకట్ పల్లిలో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనను దమ్ముంటే పట్టుకోండి అంటూ గతంలో ఐ బొమ్మ నిర్వాహకుడు పోలీసులకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

I Bomma Website: ఐ-బొమ్మ  నిర్వాహకుడు అరెస్ట్
I-Bomma website

ఐ-బొమ్మ(I-Bomma website) నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టయ్యాడు. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ ఇమ్మడి రవి వచ్చారు. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐ బొమ్మ వెబ్ సైట్ ను నిర్వహించేవాడు. ఈ వెబ్ సైట్ నిండా తెలుగు సినిమాల పైరసీ(Telugu movie piracy), ఓటీటీ కంటెంట్ ఉంది. దీంతో ఐ బొమ్మపై తెలుసు సినీ నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొడ్యూసర్ల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.


ఈ క్రమంలోనే ఐ బొమ్మ నిర్వాహకుడు పోలీసులకు సవాల్ విసిరాడు. తనను దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసరడం సంచలనంగా మారింది. ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు శనివారం రవిని అరెస్ట్(Indian police arrests Ravi) చేశారు. అతడు భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడని సమాచారం. అరెస్ట్ అనంతరం అతడి అకౌంట్లో రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. సర్వర్లు లాగిన్ చేయించి పైరసీ కంటెంట్ చెక్ చేశారు. అతడిని కోర్టులో ప్రవేశపెడతారని తెలుస్తోంది.


ఇవీ చదవండి:


ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. డీఎన్ఏ అతడిదే..

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. ఉమర్ బంధువు అరెస్ట్..

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..


ఇక ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. అతడు 2019 నుండి ఐ బొమ్మ(i Bomma) వెబ్‌సైట్ నిర్వహిస్తున్నాడు. ఆరేళ్ల కాలంలో వేలాది పైరసీ సినిమాలను వెబ్ సైట్ లో అప్లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు థియేటర్లో విడుదలైన సినిమాలను గంటల వ్యవధిలో వెబ్‌సైట్లో అప్లోడ్ చేస్తున్నాడు. దీంతో సినీ నిర్మాతలకు భారీ నష్ట జరిగింది. ఐ బొమ్మతో పాటు 65 పైరసీ వెబ్ సైట్లపై కూడా సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు కీలక నిందితులను అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు.. తాజాగా ఇమ్మడి రవి అరెస్ట్ చేశారు. అతని విచారిస్తున్న పోలీసులు పలు వివరాలు సేకరిస్తున్నారని సమాచారం. రవి ఏజెంట్ల నెట్‌వర్క్ తో పాటు హ్యాండ్లర్ల నెట్‌వర్క్ పై పోలీసులు(CCS Police) కూపీ లాగుతున్నారు.

Updated Date - Nov 15 , 2025 | 12:54 PM