YS Jagan CBI Court: ఆరేళ్ల తరువాత కోర్టుకు జగన్.. మూడు నిమిషాల్లోనే
ABN , Publish Date - Nov 20 , 2025 | 03:22 PM
ఆరేళ్ల తరువాత నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్ వచ్చారు. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే కోర్టు హాల్‌లో జగన్ ఉన్నారు.
హైదరాబాద్, నవంబర్ 20: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నాంపల్లి సీబీఐ కోర్టుకు (Nampally CBI Court) వచ్చారు. దాదాపు ఆరు సంవత్సరాల తరువాత వ్యక్తిగతంగా జగన్ విచారణకు హాజరయ్యారు. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే జగన్ కోర్టు హాల్‌లో కూర్చున్నారు. న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీరేమైనా చెప్పదల్చుకున్నారా అని జగన్‌ను సీబీఐ కోర్టు న్యాయమూర్తి అడిగారు. అందుకు జగన్ తరఫు న్యాయవాది నో అని జవాబు చెప్పారు. ఆపై జగన్ వ్యక్తిగత హాజరును న్యాయస్థానం రికార్డు చేసింది. అటెండెన్స్ పూర్తి అయిన తరువాత కోర్టు నుండి జగన్ బయటకు వెళ్లిపోయారు.
కాగా.. విదేశీ పర్యటన అనుమతి పిటిషన్‌లో భాగంగా కోర్టు ఆదేశాలతో జగన్ ఈరోజు కోర్టుకు హాజరయ్యారు. పిటిషన్‌ను న్యాయస్థానం క్లోజ్ చేసింది. కేవలం 3 నిమిషాలు మాత్రమే విచారణ జరిగింది. జగన్ అప్పియరెన్స్‌ను కోర్టు రికార్డ్ చేసింది. రెగ్యులర్ కేసులతో సంబంధం లేకుండా జగన్ న్యాయస్థానానికి వచ్చారు. సీబీఐ 11 కేసుల విచారణలో జగన్ తరఫు న్యాయవాది ఈరోజు మాత్రమే ఆబ్సెంట్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఇవి కూడా చదవండి..
సన్న బియ్యాన్ని పంపిణీ చేయండి.. కేంద్రమంత్రితో సీఎం
అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే.. వారికి స్పీకర్ నోటీసులు
Read Latest Telangana News And Telugu News