Share News

MLA Defection Case: అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే.. వారికి స్పీకర్ నోటీసులు

ABN , Publish Date - Nov 20 , 2025 | 01:15 PM

ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి‌కి అసెంబ్లీ స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని స్పష్టం చేశారు.

MLA Defection Case: అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే.. వారికి స్పీకర్ నోటీసులు
MLA Defection Case

హైదరాబాద్, నవంబర్ 20: పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్(Telangana Assembly Speaker Gaddam Prasad) నోటీసులు జారీ చేయగా.. అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి వరకు అఫిడవిట్‌లు దాఖలు చేయని పరిస్థితి. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి.. స్పీకర్ నోటీసులకు స్పందించని విషయం తెలిసిందే. దీంతో వారిరువురికి స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని అసెంబ్లీ స్పీకర్ స్పష్టం చేశారు.


ఇక.. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేల విచారణ నేటితో (గురువారం)తో ముగియనుంది. కేసు విచారణ ఆలస్యంపై సుప్రీం సీరియస్ అవడంతో పాటు నాలుగు వారాలు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణలో వేగం పెంచాలని అసెంబ్లీ స్పీకర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండో విడత విచారణలో భాగంగా నలుగురు ఎమ్మెల్యేలను నేడు విచారణకు పిలిచారు. ఉదయం ఎమ్మెల్యేల విచారణ మొదలైంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీశ్ రెడ్డి కేసును స్పీకర్ విచారించారు. ఇరు వర్గాల ఓరల్ ఆర్గ్యుమెంట్స్‌ను స్పీకర్ విన్నారు. అలాగే మధ్యాహ్నం అరికెపూడి గాంధీ వర్సెస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కేసు విచారించనున్నారు. వీరి విచారణతో మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి అవుతుంది.


ఢిల్లీకి దానం...

మరోవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. నేటితో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగియనున్నప్పటికీ ఇప్పటి వరకు దానం అఫిడవిట్లు దాఖలు చేయలేదు. విచారణకు హాజరైతే వేటు పడుతుందని దానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేటు పడితే ఆరు సంవత్సరాల పాటు పోటీ చేయడానికి నో ఛాన్స్. ఈ క్రమంలో రాజీనామా చేసేందుకు దానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రాజీనామా చేస్తే తన పరిస్థితి ఏంటని పార్టీ పెద్దలతో దానం సంప్రదింపులు జరుపనున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

లెక్కే లేదు... అమలు ఇంకెక్కడ...

రైతు బజార్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 20 , 2025 | 01:40 PM