Revanth Reddy Fine Rice: సన్న బియ్యాన్ని పంపిణీ చేయండి.. కేంద్రమంత్రితో సీఎం
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:32 PM
దేశ వ్యాప్తంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హోటల్ తాజ్‌కృష్ణలో కేంద్రమంత్రితో సీఎం సమావేశమయ్యారు.
హైదరాబాద్, నవంబర్ 20: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల్లో వినియోగదారులకు సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి (Union Minister Prahlad Joshi) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వివరించారు. ఈరోజు (గురువారం) ఉదయం హోటల్ తాజ్‌కృష్ణలో కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు తినే బియ్యాన్ని సరఫరా చేస్తేనే సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని ముఖ్యమంత్రి అన్నారు.

తెలంగాణలాగే కేంద్రం కూడా దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ అంశాన్ని పరిశీలించాలని కేంద్రమంత్రి కోరారు. అవసరమైతే అధ్యయనం చేసి తగు నిర్ణయం తీసుకోవాలని వినతి చేశారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత పరిశీలించి దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కాగా.. తెలంగాణ వ్యాప్తంగా రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ నెలకు 6 కిలోల చెప్పున సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
రైతు బజార్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక సూచనలు
సన్న బియ్యాన్ని పంపిణీ చేయండి.. కేంద్రమంత్రితో సీఎం
Read Latest Telangana News And Telugu News