Share News

Sarpanch Powers and Duties: సర్పంచ్ అధికారాలు, విధులేంటో తెలుసా.?

ABN , Publish Date - Dec 06 , 2025 | 07:52 AM

స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. గ్రామాల్లో ఎన్నికల హడావుడి నెలకొంది. అయితే.. సర్పంచ్ అధికారాలేంటి? నిర్వర్తించాల్సిన విధులేంటనే విషయాన్ని ఓ సారి తెలుసుకుందాం..

Sarpanch Powers and Duties: సర్పంచ్ అధికారాలు, విధులేంటో తెలుసా.?
Sarpanch Powers and Duties

హైదరాబాద్, డిసెంబరు 06: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. తొలివిడత పోలింగ్ జరిగే గ్రామాల్లో ఉదయం, సాయంత్రం అనే తేడా లేకుండా పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి అనుచరులు.. వీధుల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పంచాయతీ రాజ్ చట్టం(Panchayat Raj Act) సర్పంచ్‌ల అధికారాలతో పాటు వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలను స్పష్టంగా నిర్వచించింది(Powers and Duties of Sarpanch). విధి నిర్వహణలో సర్పంచ్‌లకు విశేష అధికారాలు కట్టబెట్టింది. ఆ కారణంగా కోర్టులో కేసులు వేసేందుకు వీల్లేకుండా రక్షణ సైతం కల్పించింది.


ఇవి చేయాల్సిందే..

  • సామూహిక మరుగుదొడ్ల ఏర్పాటు, బావుల మరమ్మతులు, పూడికతీత, జనన, మరణాల నమోదు.

  • వ్యాధుల నివారణకు చర్యలు, శ్మశానవాటికల నిర్వహణ, అనాథ శవాల దహన సంస్కారాలు.

  • పశువుల దొడ్ల ఏర్పాటు, ధర్మశాలలు, అతిథి గృహాల నిర్మాణం, నిర్వహణ.

  • రహదారుల వెంట మొక్కల పెంపకం, విద్య, ఆరోగ్య, విద్యాభివృద్ధి, వైద్యశాల, ఆటస్థలాల నిర్వహణ.

  • పంచాయతీ భవనాల నిర్మాణం, మరమ్మతులు, పంచాయతీ రోడ్లు, కల్వర్టులు నిర్వహణ.

  • మురుగు కాల్వల నిర్మాణం, మరమ్మతులు, వీధులు శుభ్రం చేయించడం, వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ.

  • గ్రామ స్థాయి గ్రంథాలయాల ఏర్పాటు, వ్యవసాయ విధానాల మెరుగుపై ప్రచార కార్యక్రమాల నిర్వహణ

  • సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, జాతరలు నిర్వహణ.

  • ప్రకృతి వైపరీత్యాల్లో సాయం, కుల, మత వివక్ష లేకుండా జీవనం గడిపేలా గ్రామస్థులను ప్రోత్సహించడం.


అధికారాలివే..

  • ప్రజాప్రయోజనాల దృష్ట్యా గ్రామంలో ఏ పనినైనా వెంటనే చేపట్టే అధికారం సర్పంచులకు ఉంటుంది. పంచాయతీల నిర్వహణ అధికారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి.

  • పంచాయతీ దస్త్రాల పరిశీలన, తనిఖీ అధికారం, గ్రామ పరిధికి సంబంధించిన ఏ సమాచారాన్నైనా తెప్పించుకోవచ్చు.

  • ఈవో, పంచాయతీ కార్యదర్శి తదితర సిబ్బంది కార్యకలాపాలపై సర్పంచ్ ఆజమాయిషీ ఖాళీఅయిన ఉప సర్పంచ్ ఎన్నికలను నిర్వహించే బాధ్యత కూడా సర్పంచ్‌కే ఉంటుంది.

  • పంచాయతీ నిధుల డ్రా, పారిశుధ్య పనుల కేటాయింపు.

  • మైనర్ పంచాయతీల్లో రూ.1 లక్ష, మేజర్ పంచాయతీల్లో రూ.2 లక్షల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతుల మంజూరు.


ఇవీ చదవండి:

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ.. ఎందుకంటే

నా వ్యాఖ్యలపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్

Updated Date - Dec 06 , 2025 | 08:39 AM