Share News

Nota Preference in Elections: నోటా గెలిస్తే పరిస్థితి ఏంటి.. తెలుసుకోండి మరి..

ABN , Publish Date - Dec 06 , 2025 | 07:00 AM

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నోటా మీట నొక్కడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఎన్నికల పోలింగ్‌లో అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పోలైతే ఏంటన్న ప్రశ్న మీకెప్పుడైనా తలెత్తిందా? అప్పుడు విజేతగా ఎవరిని ప్రకటిస్తారు? నోటా ప్రాధాన్యం ఏంటి? ఆ వివరాలు మీకోసం..

Nota Preference in Elections: నోటా గెలిస్తే పరిస్థితి ఏంటి.. తెలుసుకోండి మరి..
Nota Preference in Elections

హైదరాబాద్, డిసెంబర్ 06: పంచాయతీ ఎన్నికల్లో ఈసారి ఎన్నికల సంఘం నోటాను ప్రవేశపెట్టింది(NOTA in Elections). ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే నోటా మీట నొక్కొచ్చు. మరి బరిలో నిలిచిన అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు నోటాకు వచ్చినా ఎన్నిక రద్దయ్యే అవకాశం లేదు. ప్రస్తుత ఎన్నికల నిబంధనల ప్రకారం నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినా. రెండోస్థానంలో ఉన్న అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు.


సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైనా..

నోటాకు అత్యధికంగా ఓట్లు వస్తే ఆ ఎన్నిక ఫలితాన్ని రద్దు చేసి మళ్లీ పోలింగ్ నిర్వహించాలని గతంలో సుప్రీంకోర్టు(Supreme Court)లో ఓ పిటిషన్ దాఖలయింది. నోటా కన్నా తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులను తదుపరి ఐదేళ్ల పాటు అన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా చూసేలా నిబంధనలు రూపొందించాలని పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిశీలించిన కోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అయితే.. ఇప్పటివరకు సదరు ఆంశాలపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.


ఇవీ చదవండి:

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ.. ఎందుకంటే

నా వ్యాఖ్యలపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్

Updated Date - Dec 06 , 2025 | 08:43 AM