Share News

Sanath Nagar ESI: ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం.. ముగ్గురు మృతి

ABN , Publish Date - Nov 24 , 2025 | 04:57 PM

హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అత్యవసర విభాగంలో స్లాబ్ కుప్పకూలి ముగ్గురు కార్మికులు మరణించారు.

Sanath Nagar ESI: ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం.. ముగ్గురు మృతి

హైదరాబాద్, నవంబర్ 24: సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో సోమవారం ప్రమాదం జరిగింది. భవనం మరమ్మతులు చేస్తుండగా.. సెంట్రింగ్ కుప్పకూలింది. శ్లాబ్‌ పెచ్చులు మీద పడడంతో ముగ్గురు కార్మికులు మరణించారు. ఈఎస్ఐలోని అత్యవసర విభాగంలో ఆధునీకరణ (రెనోవేషన్) పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రిలోని ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.


శ్లాబ్ పెచ్చులు మీద పడడంతో.. వాటిని తొలగించి కార్మికుల మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు సైతం ఘటన స్థలానికి చేరుకుని.. వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఈఎస్ఐ ఆసుపత్రికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..

ధర్మేంద్ర మృతి.. ప్రముఖుల సంతాపం..

For More TG News And Telugu News

Updated Date - Nov 24 , 2025 | 05:34 PM