Hyderabad: ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులకు కీలక సూచన
ABN , Publish Date - Aug 29 , 2025 | 03:43 PM
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇవి శుక్రవారం నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 29: గణేశ్ నిమజ్జనం సందర్భంగా శుక్రవారం నుంచి హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు సెప్టెంబర్ 5వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 3:00 గంటల నుంచి అర్థరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్ వద్ద వినాయకుని విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
ఈ నేపథ్యంలో సెయిలింగ్ క్లబ్ జంక్షన్, వీవీ విగ్రహం, తెలుగు తల్లి జంక్షన్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ ఎక్స్ రోడ్డు, నల్లగుట్ట బ్రిడ్జ్, బుద్ధ భవన్ వద్ద ట్రాఫిక్‌ను మళ్లిస్తామని వివరించారు. అలాగే అప్పర్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు మార్గాల్లో అవసరాన్ని బట్టి ఆంక్షలు అమలు చేస్తామన్నారు. లిబర్టీ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, పంజాగుట్ట వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు కీలక సూచన చేశారు. అలాగే కవాడిగూడ, బేగంపేట్, మినిస్టర్ రోడ్, తెలుగు తల్లిఫ్లై ఓవర్ మీదుగా ట్రాఫిక్ మళ్లిస్తామని చెప్పారు.
వినాయక చవితి సందర్భంగా పండగను దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రతి గల్లీలో భారీగా వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇవి సెప్టెంబర్ 5వ తేదీతో ముగియనున్నాయి. అందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక ఈ నిమజ్జనం నేపథ్యంలో నగరంలో పోలీసులు భద్రతతోపాటు నిఘాను పటిష్టం చేశారు. ఈ నిమజ్జనానికి తరలివచ్చే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశాలకు హజరవుతా..
సీబీఐపై షర్మిల షాకింగ్ కామెంట్స్..
For More TG News And Telugu News