TGPSC On Group-1: గ్రూప్-1పై అప్పీల్‌కు వెళ్లేందుకు TGPSC నిర్ణయం..
ABN , Publish Date - Sep 11 , 2025 | 06:07 PM
గ్రూప్-1 పరీక్షలో అవకతవకలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై TGPSC కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వారం రోజుల్లో TGPSC పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: గ్రూప్-1 పరీక్షపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు TGPSC నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో TGPSC పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రీవాల్యుయేషన్ చేస్తే టెక్నికల్ సమస్యలు వస్తాయని TGPSC అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సింగల్ బెంచ్ తీర్పు కాపీపై లీగల్ టీమ్ గ్రౌండ్స్ ప్రిపేర్ చేస్తోంది. గ్రూప్-1 నియామకాల్లో లోపాలు లేవని TGPSC వాదించడానికి సిద్ధం అయ్యింది.
ఇవి కూడా చదవండి
జడ్పిటీసీ ఎన్నికల్లోనే దిక్కు లేదు.. 2029 గురించి కలలెందుకు?
మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం