IAS Officers: ఐఏఎస్‌లకు సీఎస్ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - May 20 , 2025 | 10:00 PM
IAS Officers : ఐఏఎస్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారులు కాస్తా హద్దుల్లో ఉండాలని స్పష్టం చేశారు. హద్దు మీరితే మాత్రం చర్యలు తప్పవంటూ ఐఏఎస్ అధికారులకు కాస్తా ఘాటుగా ఆయన వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్, మే 20: వివిధ సభలు, సమావేశాల్లో కొందరు ఐఏఎస్ అధికాారులు వ్యవహరిస్తున్న తీరుతోపాటు వారి ప్రవర్తనపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు సీరియస్ అయ్యారు. సర్వీస్ హోదాకు తగనిది ఏది చేయ వద్దంటూ ఐఏఎస్ అధికారులకు ఆయన సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ కాస్తా ఘాటుగా వారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ క్రమంలో ఐఏఎస్ అధికారులకు ఆయన పలు సూచనలు చేస్తూ.. కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఇంతకీ జరిగిందంటే..
ఇటీవల ఓ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కాళ్లకు ఐఏఎస్ అధికారి శరత్ మొక్కారు. ఈ నేపథ్యంలో సీఎస్ రామకృష్ణారావు స్పందించారు. ఆ క్రమంలో మంగళవారం కీలక సూచనలతో కూడిన ఉత్తర్వులను ఆయన జారీ చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల అనుచిత ప్రవర్తన వల్ల ఐఏఎస్‌ల ప్రతిష్టను దెబ్బ తీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యల కారణంగా ఐఏఎస్ అధికారుల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని తెలిపారు. ఐఏఎస్ 1968 లోని 3(1) నియమావళి ప్రకారం ఆల్ ఇండియా సర్వీసెస్ సభ్యుడు విధుల పట్ల అంకిత భావంతో ఉండాలని ఆయన ఈ సందర్భంగా ఐఏఎస్‌లకు సూచించారు. సర్వీస్ హోదాకు తగనిది ఏది చేయొద్దంటూ ఐఏఎస్‌లకు ఆయన కాస్తా ఘాటుగా సూచించారు.
మరోవైపు ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఐఏఎస్ అధికారులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫీల్డ్‌లోకి వెళ్లకుండా.. ఏసీ గదులకే పరిమితమవుతున్నారంటూ ఐఏఎస్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి సునిశిత విమర్శలు చేసిన విషయం విధితమే. ఆ క్రమంలో గతంలో ఐఏఎస్ అధికారులు ఎలా ఉండేవారో.. పలువురు పేర్లను సైతం ఈ సందర్భంగా సీఎం రేవంత్ గుర్తు చేసిన విషయం విధితమే.
ఇంకోవైపు గతంలో సైతం అంటే.. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపుగా ఐఏఎస్ అధికారి శరత్ తరహా ఘటన చోటు చేసుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు మొకాళ్లపై కూర్చొని సీఎం హోదాలో ఉన్న వైఎస్ జగన్‌కు వివరిస్తున్న ఓ పొటో వైరల్ అయింది. ఈ వ్యవహరం నాడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం విధితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
Divyangulu: దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
AP Govt: 1 నుంచి షాపుల ద్వారానే రేషన్ పంపిణీ
United Nations: మరో 48 గంటల్లో మరణించనున్న 14 వేల చిన్నారులు
AP I CET 2025 Result: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల
Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
For Telangana News And Telugu News