Share News

AP Govt: 1 నుంచి షాపుల ద్వారానే రేషన్ పంపిణీ

ABN , Publish Date - May 20 , 2025 | 08:33 PM

AP Govt: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథితోపాటు నాదెండ్ల మనోహర్ వివరించారు.

AP Govt: 1 నుంచి షాపుల ద్వారానే రేషన్ పంపిణీ

అమరావతి, మే 20: ప్రజా పంపిణి వ్యవస్థ పారదర్శకతతో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆ క్రమంలో రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మంగళవారం అమరావతిలో మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకర్లతో మాట్లాడుతూ.. జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారానే రేషన్ పంపిణీ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. 65 సంవత్సరాలు.. అంతకంటే కంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులకు, దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీ చేస్తామని ఆయన ప్రకటించారు.

అయితే వ్యాన్ ఆపరేటర్లకు ఉచితంగా వ్యానుని వారికే అందిస్తున్నామన్నారు. దీని ద్వారా రేషన్ అక్రమ రవాణాకు కాస్త అయిన అడ్డుకట్ట పడుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే జగన్ ప్రభుత్వ హయాంలో 9,269 ఎమ్‌డీయూ వాహనాల కొనుగోలు కోసం రూ. 1,800 కోట్లు ఖర్చు చేశారని.. అలాగే పైలట్ ప్రాజెక్ట్‌కు మరో రూ. 200 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. అయినా ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు మాత్రం రాలేదని ఆయన పెదవి విరిచారు. ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా 30 శాతం మంది వినియోగదారులు ఇంటి వద్దకే వాహనాల ద్వారా రేషన్ పంపిణిపై అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు.


పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్‌కు వాహన వ్యవస్థ వచ్చిన తర్వాతే అధికమైందని విమర్శించారు. ఈ వ్యవహారంలో 288 కేసులు నమోదు చేశామని.. అలాగే వ్యాన్ ఆపరేటర్లపై వందల కేసులు ఉన్నాయని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. అంతేకాదు.. సిండికేట్‌గా.. ఒక వ్యవస్థగా ఏర్పడి.. గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి రైస్ స్మగ్లింగ్‌కు పాల్పడ్డారని ఆయన వివరించారు. నెలకు రూ. 27 వేలు కార్పొరేషన్ నుంచి వ్యాన్ ఆపరేటర్లకు నగదు చెల్లిస్తున్నామని చెప్పారు. ఇక ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం నుంచి రాత్రి వరకు రేషన్ షాప్ అందుబాటులో ఉంటుందన్నారు. ఈ 15 రోజులు మాత్రమే పని చేసే వాహనాలకు గత ప్రభుత్వం నీళ్ల ప్రాయంగా ఖర్చు చేసిందని మండిపడ్డారు.

PardhaSardhi.jpg

మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. అనంతపురంలో ఎనర్జీ రంగం ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. డైకిన్ ఎయిర్ కండిషన్ సంస్థ.. తన యూనిట్‌ను రూ. 2475 కోట్ల పెట్టుబడితో ఇక్కడ ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ పరిశ్రమ ద్వారా 5400 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇక భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి 500 ఎకరాలు భూమిని ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఐటీ సెక్టార్, ఇండ్రస్ట్రియల్ హబ్‌గా విశాఖపట్నం రూపాంతరం చెందుతోందన్నారు.


అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అమరావతిలో న్యాయ విశ్వ విద్యాలయానికి స్థలం కేటాయింపు జరిగిందని చెప్పారు. ఇక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏలూరులో స్థాపించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అన్ని విశ్వ విద్యాలయాలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఇక శ్రీపొట్టి శ్రీరాములు యూనివర్సిటీనీ రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రేషన్ కార్డులలో పేరు చేర్చడం కోసం దాదాపు మూడున్నర లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ దరఖాస్తుల్లో మార్పు చేర్పులలో ప్రస్తుతం కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 70 వేల మెట్రిక్ టన్నుల అక్రమ బియ్యాన్ని కూటమి ప్రభుత్వం సీజ్ చేసిందని మంత్రి పార్థసారథి వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

United Nations: మరో 48 గంటల్లో మరణించనున్న 14 వేల చిన్నారులు

AP I CET 2025 Result: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 20 , 2025 | 09:23 PM