Divyangulu: దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
ABN , Publish Date - May 20 , 2025 | 09:13 PM
Minister Seethakka: రాష్ట్రంలోని దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఒక దివ్యాంగులు మరో సాధారణ వ్యక్తిని వివాహం చేసుకుంటే ప్రభుత్వం ప్రోత్సాహకం అందించేంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, మే 20: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై ఇద్దరు దివ్యంగులు వివాహం చేసుకుంటే ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వారికి సైతం రూ. లక్ష ఆర్థిక సహాయం వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో ఒకరు దివ్యాంగులు.. మరొకరు సాధారణ వ్యక్తిని వివాహం చేసుకుంటేనే రూ. లక్ష ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అందేంది. అయితే ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే.. ఈ ఆర్థిక సాయం వర్తించేది కాదు.
ఈ విషయం మహిళా శిశు, వయవృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దృష్టికి ఇటీవల వెళ్లింది. దీంతో ఆమె వెంటనే స్పందించారు. ఇకపై ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే ఈ ప్రొత్సాహకం అందేలా జీవో జారీ చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను మంత్రి సీతక్క మంగళవారం ఆదేశించారు. ఆ క్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
United Nations: మరో 48 గంటల్లో మరణించనున్న 14 వేల చిన్నారులు
AP I CET 2025 Result: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల
Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
AP Govt: 1 నుంచి షాపుల ద్వారానే రేషన్ పంపిణీ