Congress Party: టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించిన పార్టీ హైకమాండ్
ABN , Publish Date - Jun 09 , 2025 | 10:00 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి గంట పాటు భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ, జూన్ 09: తెలంగాణ పీసీసీ కార్యవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోమవారం ప్రకటించింది. పీసీసీలో 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది జనరల్ సెక్రటరీలను ప్రకటించింది. అందుకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. పీసీసీ ఉపాధ్యక్షులుగా.. బల్మూరి వెంకట్, బసవరాజ్ సారయ్య, బొంతు రామ్మోహన్, కుమార్‌రావు, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ఝాన్సీరెడ్డి, బండి రమేష్, కొండ్రు పుష్పలీల, కె.నీలిమా, బి.కైలాష్‌కుమార్, ఎన్.శ్రీనివాస్, ఆత్రం సుగుణ, గాలి అనిల్‌కుమార్, సీహెచ్ సత్యనారాయణ, ఎల్.ధన్వంతి, ఎం.వేణు గౌడ్, కె.వినయ్ రెడ్డి, కె.మల్లయ్య, ఎం.ఎ.ఫహీం, ఎస్. సురేశ్‌కుమార్, అక్సర్ యూసుఫ్ జాహీ, ఎస్.జగదీశ్వర్‌రావు, నవాబ్ నిజాహిద్ ఆలం ఖాన్, జి.మోహన్ రెడ్డి, సీహెచ్ సంగమేశ్వర్ ఉన్నారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి గంట పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే పలువురు మంత్రులకు సంబంధించిన శాఖల మార్పుపై ఈ భేటీలో కీలక చర్చ జరిగినట్లు సమాచారం.
మంగళవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఖర్గేతో సైతం కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై సైతం చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే విధంగా కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
క్షమాపణలు చెప్పాల్సిందే: వైఎస్ షర్మిల
జగన్ గుట్టు విప్పిన రేణుకా చౌదరి
Read Latest Telangana News And Telugu News