Telangana Praja Palana Utsavalu: తెలంగాణలో ప్రజా పాలన ఉత్సవాలు.. డిసెంబర్ 1 నుంచి 13 వరకు
ABN , Publish Date - Nov 30 , 2025 | 08:08 PM
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తి కావడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవడంతో రాష్ట్రవ్యాప్తంగా 'ప్రజా పాలన ఉత్సవాలు' ఘనంగా జరుగనున్నాయి. డిసెంబర్ 1 నుంచి 9 వరకు..
హైదరాబాద్, నవంబర్ 30: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తి కావడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవడంతో రాష్ట్రవ్యాప్తంగా 'ప్రజా పాలన ఉత్సవాలు' ఘనంగా నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 1 నుంచి 9 వరకు రోజూ ఒక ఉమ్మడి జిల్లాలో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
ప్రజలకు మరింత చేరువయ్యే పాలన, పారదర్శకత, వేగవంతమైన అభివృద్ధి.. ఇవే మా ప్రభుత్వ లక్ష్యాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సందర్భంగా చెప్పారు. ప్రజా పాలన ఉత్సవాల ద్వారా గత రెండేళ్లలో చేసిన పనులను ప్రజల ముందుంచుతూనే, 2047 నాటికి తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దే విజన్‌ను పంచుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ ఉత్సవాల్లో భాగం కావాలని ప్రభుత్వం ఆహ్వానిస్తోందన్నారు.
ప్రధాన షెడ్యూల్: డిసెంబర్ 1 (రేపు): మక్తల్‌లో ఉత్సవాలు ప్రారంభం (మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు)
డిసెంబర్ 1 నుంచి 9 వరకు: ప్రతిరోజూ ఒక ఉమ్మడి జిల్లాలో కార్యక్రమం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సంబంధిత ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.
డిసెంబర్ 6: హైదరాబాద్‌లోని యూనివర్సిటీలో ఉత్సవాలు – సీఎం రేవంత్ రెడ్డి హాజరు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
డిసెంబర్ 8 & 9: ఫ్యూచర్ సిటీలో భారీ కార్యక్రమాలు
8వ తేదీ: గడిచిన రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరణ
9వ తేదీ: “తెలంగాణ విజన్-2047” డాక్యుమెంట్ భారీ ఈవెంట్‌లో విడుదల. జాతీయ-అంతర్జాతీయ ప్రతినిధులకు ఆహ్వానం
డిసెంబర్ 10 & 11: ఫ్యూచర్ సిటీలోని స్టాల్స్ సాధారణ ప్రజల సందర్శనకు ఓపెన్
డిసెంబర్ 13: ఉప్పల్ స్టేడియంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సి పాల్గొనే ఫ్రెండ్లీ మ్యాచ్ – ఉత్సవాలకు గ్రాండ్ ఫినిష్!
ఇలా ఉండగా, డిసెంబర్ 13న మెస్సి మ్యాచ్ కోసం టికెట్ల బుకింగ్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి.
ఇవి కూడా చదవండి..
బీఎల్ఓల పరిహారం రెట్టింపు.. ఈసీ నిర్ణయం
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిల పక్షం భేటీ..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి