Local Body Elections 2025: స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్.. రేపే నోటిఫికేషన్..
ABN , Publish Date - Oct 08 , 2025 | 08:28 PM
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు దాదాపు లైన్ క్లియర్ అయినట్లే. బీసీ రిజర్వేషన్ల అంశం విచారణ సందర్భంగా గురువారం నాడు విడుదలయ్యే ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వాలన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో రేపు యథావిధిగా నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది.
హైదరాబాద్: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు దాదాపు లైన్ క్లియర్ అయినట్లే. బీసీ రిజర్వేషన్ల అంశం విచారణ సందర్భంగా గురువారం నాడు విడుదలయ్యే ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వాలన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో గురువారం యథావిధిగా నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియపై చర్చించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు తామంతా సిద్ధంగా ఉన్నామని అన్ని జిల్లాల కలెక్టర్లు ఈసీకి తెలిపారు. నానినేషన్ల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసుకోవాలని ఈసీ ఆదేశించారు.
రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ..
కాగా, 5 దశల్లో 31 జిల్లాల్లోని 565 మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఈసీ షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం (అక్టోబర్ 9) నాడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అనంతరం ఉదయం 10:30 గంటల నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభిస్తారు. అలాగే అక్టోబర్ 13 నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మెుదలుపెడతారు. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్.. అక్టోబర్ 27న రెండో విడత పోలింగ్ ఉంటుంది. నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
మూడు దశల్లో గ్రామ పంచాయతీ..
అలాగే మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించింది. అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ జారీ చేస్తుంది ఎన్నికల కమిషన్. అక్టోబర్ 17 నుంచి 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 31న తొలి విడత పోలింగ్, ఫలితాలు ఉంటాయి. ఇక, అక్టోబర్ 21న రెండో విడత నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రెండో విడతలో అక్టోబర్ 21న నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ.. నవంబర్ 4న రెండో విడత పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలు విడుదల చేస్తారు. మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 25న నోటిఫికేషన్ ఇచ్చి.. అక్టోబర్ 25 నుంచి 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు నవంబర్ 8న పోలింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. అయితే, తెలంగాణ హైకోర్టు స్టే కారణంగా 14 ఎంపీటీసీ, 27 గ్రామ పంచాయతీలు, 246 వార్డులకు ఎన్నికలు వాయిదా పడ్డాయి.
Also Read:
కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ఫ్రైజ్..
మాజీ సీఎం జగన్‌పై కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఫైర్..
అభ్యర్థుల ఖరారుకు బీజేపీ కీలస సమావేశం