Minister Sridhar Babu: వన్ బయో హబ్ ప్రారంభంతో తెలంగాణకు కొత్త దశ: మంత్రి శ్రీధర్ బాబు
ABN , Publish Date - Nov 24 , 2025 | 09:49 PM
వన్ బయో హబ్ ప్రారంభంతో తెలంగాణ బయోఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగంలో కొత్త దశ ప్రారంభమైందని మంత్రి డి.శ్రీధర్ బాబు తెలిపారు. స్టార్ట్ అప్స్ నుండి పెద్ద కంపెనీల వరకు ప్రాసెస్ డెవలప్‌మెంట్, పైలట్ స్కేల్ ట్రయల్స్‌కు ప్రపంచ స్థాయి సౌకర్యాలు వచ్చాయన్నారు.
హైదరాబాద్, నవంబర్ 14: 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని జెనోమ్ వ్యాలీలో దేశంలోనే తొలి సింగిల్ యూజ్ బయోలాజికల్ స్కేల్ - అప్ ఫెసిలిటీనీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. వన్ బయో హబ్ ప్రారంభంతో తెలంగాణ బయోఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగంలో కొత్త దశ ప్రారంభమైందన్నారు. స్టార్ట్ అప్స్ నుండి పెద్ద కంపెనీల వరకు ప్రాసెస్ డెవలప్‌మెంట్, పైలట్ స్కేల్ ట్రయల్స్‌కు ప్రపంచ స్థాయి సౌకర్యాలు వచ్చాయని తెలిపారు. ఈ ఫెసిలిటీతో 500 వరకు హై క్వాలిటీ కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
హైదరాబాద్ గ్లోబల్ బయోలాజిక్స్ అండ్ థెరప్యూటిక్స్‌లో హబ్‌గా మారేందుకు పెద్ద అడుగు పడిందని చెప్పారు. వన్ బయోలో 1.5 లక్షల చదరపు అడుగుల ఆర్ అండ్ డీ ల్యాబ్స్, ఇన్నోవేషన్ సూట్స్, అనలిటికల్ సెంటర్ల ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం నుంచి రూ. 500 కోట్లు అదనపు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగం విలువ ఇప్పటికే 100 బిలియన్ డాలర్ల మైలురాయి దాటిందని గుర్తు చేశారు. ఇండియా ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిలో 40% వాటా.. ప్రపంచ వ్యాక్సిన్ తయారీలో 1/3 ఉత్పత్తి హైదరాబాద్ నుంచే జరుగుతుందని మంత్రి డి.శ్రీధర్ బాబు సోదాహరణగా వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐబొమ్మ రవి కన్ఫెషన్ రిపోర్ట్‌లో విస్తుపోయే విషయాలు..
సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..
For More TG News And Telugu News