IBomm Ravi Confession Report: ఐబొమ్మ రవి కన్ఫెషన్ రిపోర్ట్‌లో విస్తుపోయే విషయాలు..
ABN , Publish Date - Nov 24 , 2025 | 08:39 PM
ఐబొమ్మ రవి కేసులోక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవిది మొదటి నుంచి క్రిమినల్ మెంటాలిటీ అని కన్ఫెషన్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 24: ఐబొమ్మ రవి కేసులోక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవిది మొదటి నుంచి క్రిమినల్ మెంటాలిటీ అని కన్ఫెషన్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. స్నేహితుడి గుర్తింపు కార్డులతో అతడు నేరాలకు పాల్పడే వారని చెప్పారు. ఈ కేసులో ఐబొమ్మ రవి భార్యను సైతం విచారించామని తెలిపారు. భార్య, పిల్లలను చిత్రహింసలకు గురి చేసేవాడని పేర్కొన్నారు. రవి ప్రవర్తన నచ్చక పోవడంతో భార్య విడాకులు ఇచ్చిందన్నారు. పోస్టర్ డిజైన్ చేసినందుకు నిఖిల్‌కు ప్రతి నెల రూ. 50 వేలు రవి చెల్లించేవాడని చెప్పారు. ఐబొమ్మ సైట్‌లో బెట్టింగ్ బగ్ పెట్టడం ద్వారా రవికి లక్ష వ్యూస్‌కు 50 వేల డాలర్లు వచ్చేవని కన్ఫెషన్ రిపోర్ట్‌లో పోలీసులు వెల్లడించారు.
మరోవైపు ఐబొమ్మ రవి ఐదురోజుల పోలీస్ కస్టడీ ముగిసిది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు అతడికి వైద్య పరీక్షలు చేయించి.. సోమవారం నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ ఐదు రోజుల కస్టడీలో రవి వెల్లడించిన కీలక విషయాలను కన్ఫెషన్ రిపోర్ట్‌లో పోలీసులు పొందుపరిచారు. రవిపై ఐదు వేర్వేరు కేసులు నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాది శ్రీనాథ్ తెలిపారు. ఈ కేసుల్లో ఒక్కదానిలో మాత్రమే కోర్టు రిమాండ్ విధించి.. విచారణ నిమిత్తం ఐదు రోజుల కస్టడీకి అప్పగించిందని చెప్పారు. రవి తరఫు న్యాయవాదులు ఇప్పటికే కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కవితపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపాటు
సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..
For More TG News And Telugu News