Share News

Telangana High Court: కేటీఆర్, గోరెటి వెంకన్నకు బిగ్ రిలీఫ్..

ABN , Publish Date - Nov 20 , 2025 | 07:41 PM

కోడ్ ఉల్లంఘిస్తూ అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని కేటీఆర్, గోరెటి వెంకన్నపై పోలీసులు గతంలో కేసు పెట్టారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ప్రభుత్వ పథకాలపై గోరెటి వెంకన్నను కేటీఆర్ ఇంటర్వ్యూ చేశారనీ కేసు నమోదైంది. అయితే..

Telangana High Court: కేటీఆర్, గోరెటి వెంకన్నకు బిగ్ రిలీఫ్..
KTR and Goreti Venkanna

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌(KTR), ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న(Goreti Venkanna)కు తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో బిగ్ రిలీఫ్ దొరికింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌(Saifabad Police Station)లో వారిద్దరిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నమోదైన కేసులో ఊరట లభించింది. 2023 ఎన్నికల సమయంలో తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల జ్యోతి వద్ద ఇంటర్వ్యూలు చేశారని కేటీఆర్, గోరెటి వెంకన్నపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.


కోడ్ ఉల్లంఘిస్తూ అనుమతి లేకుండా డ్రోన్(Drone) ఎగురవేశారనీ పోలీసులు కేసు పెట్టారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ప్రభుత్వ పథకాలపై గోరెటి వెంకన్నను కేటీఆర్ ఇంటర్వ్యూ చేశారని విచారణ సందర్భంగా పోలీసుల తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా ఆ ఇంటర్వ్యూ ఉందని తెలిపారు. అయితే, రాజకీయ లబ్ధి కోసమే కేసు నమోదు చేశారని కేటీఆర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. కేటీఆర్, గోరెటి వెంకన్నపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.


ఈ వార్త కూడా చదవండి:

President Droupadi Murmu: రాష్ట్రపతి ముర్ము పర్యటన.. హైదరాబాద్‌‌లో ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth with Collector: సీఎం, కలెక్టర్ల మధ్య ఆసక్తికర సంభాషణ.. ఏమైందంటే.?

Updated Date - Nov 20 , 2025 | 08:23 PM