KTR Drone Flying Case: కేటీఆర్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ.. అసలు విషయం ఇదే..
ABN , Publish Date - Mar 12 , 2025 | 04:15 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‍పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. తప్పుడు కేసు పెట్టారని, వెంటనే కొట్టివేయాలని కేటీఆర్ తరఫు న్యాయవాది హైకోర్టుని కోరారు.

హైదరాబాద్: మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‍పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కేటీఆర్ గతేడాది తన అనుచరులతో కలిసి అనుమతులు లేకుండా మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారని, అలాగే డ్రోన్ ఎగరవేశారంటూ కేటీఆర్ సహా మరికొంతమందిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే, ఇవాళ (బుధవారం) విచారణ సందర్భంగా.. ఎలాంటి ఆధారాలూ లేకుండా మహదేవ్‍పూర్ పోలీసులు కేటీఆర్‍పై కేసు నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
డ్రోన్ ఎగురవేశారని అనడానికి ఎలాంటి సాక్ష్యాలూ లేవని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టినట్లు అర్థం అవుతోందని అన్నారు. ఈ మేరకు నమోదైన ఎఫ్ఐఆర్‍ను వెంటనే కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి మేడిగడ్డ ప్రాజెక్టు ఎంతో కీలకమని హైకోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. మేడిగట్ట బ్యారేజ్ నిషిద్ధ ప్రాంత జాబితాలో ఉందని, అనుమతి లేకుండా ప్రాజెక్ట వద్దకు వెళ్లి డ్రోన్ ఎగురవేశారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీని వల్ల డ్యాం భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పీపీ చెప్పుకొచ్చారు. ఇరువర్గాల వాదనలూ విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది.
కాగా, మేడిగడ్డ కుంగిపోవడంపై గతేడాది పెద్దఎత్తున రాజకీయ రగడ చెలరేగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో బీఆర్ఎస్ నేతలతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్ గతేడాది జులై 16న మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు. కాగా, అప్పుడే డ్యాం పరిస్థితిని తెలుసుకునేందుకు డ్రోన్ ఎగరవేశారంటూ కేటీఆర్‍పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు మహదేవ్‍పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Vijaysai Reddy: ముగిసిన విజయసాయిరెడ్డి సీఐడీ విచారణ.. సంచలన విషయాలు వెల్లడి..
Yogi Adityanath: నేపాల్ గొడవల్లో యూపీ సీఎం.. సడన్‌గా ట్రెండ్ అవుతున్న యోగి..