Share News

Musi Bridge: 17 బ్రిడ్జిల నిర్మాణంపై సర్వే.. మరో నెలలో సర్కార్‌కు రిపోర్ట్

ABN , Publish Date - Feb 18 , 2025 | 01:24 PM

Musi Bridge: మూసీ బ్రిడ్జిల నిర్మాణంపై ఫోకస్ పెట్టిన సర్కార్.. మూసీపై ఉన్న 17 బ్రిడ్జిల నిర్మాణంపై సర్వే చేయిస్తోంది. ఈ సర్వే చేస్తున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్.. మరో నెలరోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

Musi Bridge: 17 బ్రిడ్జిల నిర్మాణంపై సర్వే.. మరో నెలలో సర్కార్‌కు రిపోర్ట్
Musi Bridge

హైదరాబాద్, ఫిబ్రవరి 18: మూసీ (Musi) ప్రక్షాళన‌కు సంబంధించి తెలంగాణ సర్కార్ (Telangana Government) మరో ముందడుగు వేసింది. మూసీ బ్రిడ్జిల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టిసారించింది. మూసీపై ఉన్న 17 బ్రిడ్జిలను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సర్వే చేయిస్తోంది. నిజాం కాలంలో కట్టిన బ్రిడ్జిల పటిష్టత‌ను ఇంజనీరింగ్ నిపుణులు పరిశీలిస్తున్నారు. రీబౌండ్ హ్యామర్ టెస్ట్, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్, డైనమిక్ లోడ్ టెస్టింగ్‌ను సంస్థ నిర్వహిస్తోంది. నాగోల్, ఇమ్లి బండ్, ముస్లింజంగ్, నయాపూల్, పురాణాపూల్, టిప్పు ఖాన్, బాపూఘాట్, అత్తాపూర్, చాదర్ఘాట్, గోల్నాక, సాలార్జంగ్ ప్రాంతాల్లో నిర్మించిన బ్రిడ్జిలను సంస్థ ప్రతినిధులు పరిశీస్తున్నారు. బ్రిడ్జిల పటిష్టతపై మరో నెలలో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు.


చాధర్ ఘాట్ బ్రిడ్జి హైట్ పెంచాలని నివేదికను సిద్ధం చేసింది సంస్థ. మూసీ పైనున్న బ్రిడ్జిలను వారసత్వ కట్టడాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. అవసరం అయితేనే పూర్తిగా కూల్చి... వాటి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. మూసారాంబాగ్ హై లెవెల్ బ్రిడ్జి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మరో మూడు నెలల్లో మూసరాం బాగ్ హై లెవెల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. దీన్ని 29.5 మీటర్ల పొడవు, 6 లేన్లతో 20 మీటర్ల క్యారేజ్ వే, 3.5 మీటర్ల ఫుట్ పాత్‌తో నిర్మాణం జరుగుతోంది. దాదాపు రూ.65 కోట్లతో ముసారంబాగ్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది.


ఇవి కూడా చదవండి...

తప్పిన పెను విమాన ప్రమాదం.. అసలేం జరిగిందంటే..

భారత్‌లో నియామకాలు ప్రారంభించిన టెస్లా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 18 , 2025 | 04:46 PM