Gutta Jwala: క్రీడాభివృద్ధికి మంచి కోచ్‌లు అవసరం: గుత్తా జ్వాల
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:49 PM
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో గోల్డ్ క్వెస్ట్ అంశంపై చర్చ జరిగింది. ప్యానెల్ డిస్కషన్‌లో గుత్తా జ్వాల, పీవీ సింధు, కుంబ్లే, గోపీచంద్, అంబటి రాయుడు పాల్గొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 9: తెలంగాణలో క్రీడల కోసం కోచ్‌లను ప్రోత్సహించాలని బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల (Gutta Jwala) అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ అంశంపై చర్చలో గుత్తా జ్వాల పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. క్రీడాకారులను వెలికి తీయాలంటే మంచి కోచ్‌లు ఉండాలని అన్నారు. కోచ్‌లకు సరైన ప్రోత్సాహం ఇవ్వాలని సూచనలు చేసినట్లు తెలిపారు. చాలా మంది క్రీడాకారులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ సదస్సు క్రీడారంగం అభివృద్ధికి ఉపయోగపడుతుందని గుత్తా జ్వాల అభిప్రాయపడ్డారు.
మంచి కోచ్‌లు, మంచి ఎడ్యుకేషన్ ఉండాలి: పీవీ సింధు

అలాగే ఈ చర్చలో మరో బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. స్పోర్ట్స్‌లో రాణించాలంటే మంచి కోచ్‌లు, మంచి ఎడ్యుకేషన్ ఉండాలన్నారు. క్షేత్ర స్థాయి నుంచి స్పోర్ట్స్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ రోజు సదస్సులో స్పోర్ట్స్‌పై మంచి చర్చ జరిగిందని తెలిపారు. క్రీడాభివృద్ధికి ఇలాంటి చర్చలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ సమ్మిట్‌తో క్రీడా రంగంలో మంచి మార్పులు వస్తాయన్నే నమ్మకం ఉందని పీవీ సింధు వెల్లడించారు.
కాగా.. గ్గోబల్ సమ్మిట్‌లో భాగంగా హాల్ నెం 2లో తెలంగాణ ఒలంపిక్ గోల్డ్ క్వెస్ట్ అంశంపై చర్చ జరిగింది. ప్యానెల్ డిస్కషన్‌లో సింధు, గుత్తా జ్వాలతోపాటు కుంబ్లే, గోపీచంద్, , అంబటి రాయుడు పాల్గొన్నారు. ఈ చర్చలో తమ అనుభవాలను పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి...
హై అలర్ట్.. తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు..
గ్లోబల్ సమ్మిట్.. పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ వరుస సమావేశాలు
Read Latest Telangana News And Telugu News