Telangana CM Revanth Reddy: సీఎం కీలక నిర్ణయం.. రూ. 60 కోట్లు విడుదల
ABN , Publish Date - Oct 10 , 2025 | 09:17 PM
రాష్ట్రంలో ఏదైనా సమస్య ఉత్పన్నమైతే.. సర్కార్‌పై ప్రతిపక్షాలు ఒంటికాలిపై లెగుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ఆలోచనకు తెర తీశారు. అందులో భాగంగా శుక్రవారం ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 10: ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో తరచూ ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ నేపథ్యంలో వాటికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ వెల్ఫేర్ సొసైటీ స్థాయి హాస్టల్స్‌లోని సమస్యలను పరిష్కరించేందుకుగాను రూ. 60 కోట్ల ఎమర్జెన్సీ ఫండ్స్‌ను ఆయన విడుదల చేశారు. ఒక్కో ఎస్సీ, బీసీ సొసైటీకి రూ. 20 కోట్లు.. అలాగే ఎస్టీ, మైనార్టీ సొసైటీలకు రూ. 10 కోట్ల చొప్పున ఆయన ఫండ్స్ రిలీజ్ చేశారు. ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ వినియోగించే అధికారాన్ని సొసైటీ సెక్రటరీకి దాఖలు పడేలా జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేశారు.
హాస్టల్స్‌లోని సమస్యల సత్వర పరిష్కారం కోసం ఈ తరహా ప్రత్యేక ఫండ్స్‌ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గురుకులాలు, హాస్టళ్లలో తరచూ సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. అవి మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రతిపక్షాలు స్పందించి.. నిధుల లేమి వల్లే ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఫిజికల్ ఇన్‌ఫ్రాస్టేక్చర్, ఫుడ్, హెల్త్, టీచింగ్ తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వైపు నుంచి నిధులు కోసం ఎదురు చూడకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ వినూత్న ఆలోచన చేసినట్లు తెలుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మరియా కొరినాను వరించిన నోబెల్ శాంతి బహుమతి
శాంతి బహుమతిపై స్పందించిన మచాడో.. ట్రంప్‌పై ప్రశంసలు
Read Latest TG News and Telugu News