TG Cabinet Meet: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ సంచలన నిర్ణయాలు..
ABN , Publish Date - Mar 06 , 2025 | 09:11 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. దాదాపు ఆరు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన భేటీలో మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం (Cabinet Meeting) జరిగింది. దాదాపు ఆరు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన భేటీలో మంత్రిమండలి (TG Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఫ్యూచర్ సిటీ బోర్డుకు సైతం మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
అలాగే నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయించింది. ఉగాది నుంచి 'భూ భారతి' అమలు చేయాలని తీర్మానం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర యువతకు మంత్రిమండలి శుభవార్త చెప్పింది. 10,950 విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 217 పోస్టులు, 10 జిల్లా కోర్టులకు 55 పోస్టుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Revanth Reddy: జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ.. కారణం అదేనంటూ చర్చ..
BJP victory: బీజేపీలో కొత్త ఉత్తేజం.. ఆ ఎన్నికల్లోనూ పాగా వేసేందుకు ప్లాన్