Share News

Panchayat Elections: తెలంగాణలో రేపు మలిదశ పంచాయతీ పోరు.. ఏర్పాట్లు కట్టుదిట్టం..

ABN , Publish Date - Dec 13 , 2025 | 07:35 PM

తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి నడుస్తుంది. గ్రామాల్లో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు ఇప్పటికే తొలిదశ పూర్తి కాగా.. మలిదశ ఎన్నికలకు సర్వం సిద్దం చేశారు అధికారులు.

Panchayat Elections: తెలంగాణలో రేపు మలిదశ పంచాయతీ పోరు.. ఏర్పాట్లు కట్టుదిట్టం..
TG Local Body Elections

హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. గెలుపు కోసం పార్టీ అభ్యర్థులు తమ ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. రేపు(ఆదివారం) రాష్ట్ర వ్యాప్తంగా 3,911 గ్రామాల్లో రెండోదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 13,128 సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా.. 29,903 వార్డులకు 78,158 వార్డు సభ్యులు బరిలో నిలిచారు. రేపు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరిగి ఫలితాలు రానున్నాయి.


ఎన్నికల నిర్వహణ కోసం శనివారం సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని పంపించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తొలిదశ పోరులో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు మెజార్టీ స్థాయిలో గెలిచారు. ఆ తర్వాత స్థానంలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. రెండో విడత ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఉన్న అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా చేసుకొని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇంటింటికి తీరిగి నగదు, మద్యం, మాంసాహారం ఇస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డబ్బు అయితే ఫోన్ పే లాంటి మాధ్యమాల ద్వారా నగదు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కుల సంఘాల వారీగా తాయిలాలు, హామీలు ఇస్తు మచ్చిక చేసుకుంటూ అభ్యర్థులు రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తున్నట్లుగా సమాచారం.

ముఖ్యంగా శంషాబాద్, షాద్ నగర్, కేశంపేట ప్రాంతాల్లో ఓటుకు 5 వేల నుంచి 10 వేల వరకు పంచినట్లు సమాచారం. పోలింగ్ రోజు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయి. ఇక రెండో విడత ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు ఉంటుందని ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే..తొలిదశ పోరు కొన్ని చెదురుమదురు సంఘటలను మినహా ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు తెలిపారు.


ఇవీ చదవండి:

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. వాటిపై ఫోకస్

ఉప్పల్ స్టేడియంలో అడుగుపెట్టనున్న రేవంత్, మెస్సీ

Updated Date - Dec 13 , 2025 | 07:35 PM