Share News

Telangana Budget 2025: ఇదీ తెలంగాణ బడ్జెట్.. ఏయే శాఖలకు ఎంత కేటాయించారంటే..

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:36 AM

Telangana Budget 2025: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బుధవారం శాసనసభలో ప్రశేపెట్టారు. రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌తో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది సర్కార్. ఏయే శాఖలకు ఎంత కేటాయించారో చూద్దాం.

Telangana Budget 2025: ఇదీ తెలంగాణ బడ్జెట్.. ఏయే శాఖలకు ఎంత కేటాయించారంటే..
Telangana Budget 2025

హైదరాబాద్, మార్చి 19: 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Telangana Minister Bhatti Vikramarka) శాసనసభలో (Telangana Legislative Assembly) ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. అలాగే 2024-25 తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లుగా ఉంది. మూల వ్యయం రూ.36,504 కోట్లుగా ఉంది.


శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు

  • రైతు భరోసా - రూ.18 వేల కోట్లు

  • వ్యవసాయ శాఖకు - రూ.24,439 కోట్లు

  • పశుసంవర్థక శాఖకు - రూ.1,674 కోట్లు

  • పౌర సరఫరాల శాఖ- రూ.5,734 కోట్లు

  • విద్య - రూ.23,108 కోట్లు

  • ఉపాధి కల్పన - రూ.900 కోట్లు

  • పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి - రూ.31,605 కోట్లు

  • స్త్రీ, శిశు సంక్షేమం - రూ.2,861 కోట్లు

  • ఎస్సీ సంక్షేమం - రూ.40,232 కోట్లు

  • ఎస్టీ సంక్షేమం - రూ.17,169 కోట్లు

  • బీసీ సంక్షేమం - రూ.11,405 కోట్లు

  • మైనర్టీ సంక్షేమం - రూ.3,591 కోట్లు

  • చేనేత - రూ.371 కోట్లు

  • ఐటీ - రూ.774 కోట్లు

  • మహిళా, శిశు సంక్షేమానికి - రూ. 2,862 కోట్లు

  • హెచ్ సిటీ డెవలప్మెంట్‌ - రూ.150 కోట్లు


  • పారిశ్రామిక రంగం - రూ.3,525 కోట్లు

  • విద్యుత్‌ - రూ.21,221 కోట్లు

  • వైద్యారోగ్యం - రూ.12,393 కోట్లు

  • పురపాలక, పట్టణాభివృద్ధి - రూ.17,677 కోట్లు

  • నీటిపారుదల - రూ.23,373 కోట్లు

  • ఆర్‌ అడ్‌ బీ - రూ.5,907 కోట్లు

  • పర్యాటక రంగం - రూ.775 కోట్లు

  • సాంస్కృతిక రంగం - రూ.465 కోట్లు

  • అడవులు-పర్యావరణం - రూ.1,023 కోట్లు

  • దేవాదాయ, ధర్మాదాయ శాఖ - రూ.190 కోట్లు

  • శాంతిభద్రతలు - రూ.10,188 కోట్లు

  • ఇందిరమ్మ ఇళ్లకు - రూ.22,500 కోట్లు

  • ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు చొప్పున 4.50 లక్షల ఇళ్లు

  • హోంశాఖ-రూ.10,188 కోట్లు

  • క్రీడలు - రూ.465 కోట్లు

  • గృహజ్యోతి, ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్‌ కోసం - రూ.3 వేల కోట్లు

  • ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల కోసం రూ.11,600 కోట్లు


ఇవి కూడా చదవండి...

KTR Criticizes Congress: ఇచ్చిన తేదీ దాటిపాయే... సన్నాలు ఏవీ సారూ

Big Shock To YSRCP: వైసీపీకి బిగ్‌ షాక్.. మరో నేత జంప్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 19 , 2025 | 03:41 PM