Palamuru-Rangareddy: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై విచారణ.. బేల్ అఫిడవిట్‌లో ఏముందంటే..
ABN , Publish Date - Mar 07 , 2025 | 03:34 PM
ఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మేఘా సంస్థకు చెందిన ఇరువర్గాల న్యాయవాదలూ వాదనలు వినిపించారు.

ఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (Palamuru-Rangareddy Lift Irrigation)లో అక్రమాలు జరిగాయంటూ సుప్రీంకోర్టు (Supreme Court)లో వేసిన పిటిషన్‌పై ఇవాళ (శుక్రవారం) విచారణ జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఉన్నత న్యాయస్థానాన్ని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి (Nagam Janardhan Reddy) ఆశ్రయించారు. అవినీతిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని ఆయన కోరారు. కాగా, దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్‌ల ధర్మాసనం నాగం, మేఘా సంస్థ తరఫు వాదనలు విన్నారు.
మరోవైపు గతేడాది డిసెంబర్‌లో విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాల మేరకు బేల్(BHEL) అఫిడవిట్ దాఖలు చేసింది. ఎత్తిపోతల పథకానికి సరఫరా చేసిన యంత్రాలు, తమకు వచ్చిన బిల్లులు, తదుపరి తమ బాధ్యత వంటి విషయాలను అఫిడవిట్‌లో పేర్కొంది. బేల్ సంస్థ కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలు తాము చేసిన ఆరోపణలను నిజం చేస్తున్నాయని నాగం తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనానికి తెలిపారు. ప్రభుత్వ టెండర్‌లో మూడో వంతు కూడా బేల్ సంస్థకు చెల్లించలేదని అఫిడవిట్‌లో చెప్పిన అంశాలు స్పష్టం చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా బేల్ దాఖలు చేసిన అఫిడవిట్, దానికి నాగం ఫైల్ చేసిన రిజాయిండర్లను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టులో మూడు పిటిషన్లు కొట్టివేశారని, మరికొన్ని ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనానికి మేఘా సంస్థ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్కి తెలిపారు. కాగా, అక్రమాలు జరిగాయని స్పష్టంగా కనిపిస్తున్నందున వెంటనే స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విజ్ఞప్తి చేశారు. సవివరంగా వాదనలు విన్న తర్వాత స్వతంత్ర దర్యాప్తు అంశాన్ని నిర్ణయిస్తామని సీజేఐ పేర్కొన్నారు. వాదనల అనంతరం తదుపరి విచారణను మే 13 నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
phone tapping case twist: ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్
Raghunandan Rao: కేసీఆర్‌తో భేటీలో ఆ విషయం మాట్లాడు.. కవితకు ఎంపీ రఘునందన్ మాస్ సవాల్