Share News

Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు నోటీసులు

ABN , Publish Date - Jul 15 , 2025 | 10:06 PM

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం సిట్ కార్యాలయానికి రావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.

Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు నోటీసులు
MLC Teenmaar Mallanna

హైదరాబాద్, జులై 15: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను సిట్ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. జులై 17వ తేదీన జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి రావాలని ఆయనకు ఆ నోటీసుల్లో సూచించారు. మరో వైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును మంగళవారం సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అందులోభాగంగా దాదాపు 8 .30 గంటల పాటు ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయనకు పలు ప్రశ్నలు సంధించి.. పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తుంది.


ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురు పోలీస్ ఉన్నతాధికారులను సిట్ అధికారులు విచారించారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో తాము ఇదంతా చేశామని సిట్ అధికారుల ఎదుట వారంతా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లి పోయారు. దీంతో విదేశాల నుంచి ఆయన్ని రప్పించేందుకు సిట్ అధికారులు కోర్టును ఆశ్రయించారు.


ఆ క్రమంలో ప్రభాకర్ రావు సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు కూడా ప్రభాకర్‌ను అరెస్ట్ చేయవద్దంటూ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అందులో భాగంగా ప్రభుత్వానికి గడువు సైతం విధించింది. అయితే తమ విచారణలో ప్రభాకర్ రావు నోరు విప్పక పోవడంతో.. సుప్రీంకోర్టుకు వెళ్లాలనే భావనలో సిట్ అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభాకర్ రావు వద్ద నుంచి మరిన్ని వివరాలు రాబట్టాలనే కోణంలో సిట్ అధికారులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ అరెస్ట్

రోడ్డు ప్రమాదాల్లో 13 మంది మృతి

శుభాంశు శుక్లా బృందాన్ని ఆసుపత్రికి తరలించిన నాసా..

For More Telangana News and Telugu News..

Updated Date - Jul 15 , 2025 | 10:08 PM