Share News

Shocking incident: రాజేంద్రనగర్‌లో విషాదం..

ABN , Publish Date - Aug 21 , 2025 | 11:21 AM

రాజేంద్రనగర్‌లోని కిస్మత్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదంటూ భర్త మందలించడంతో.. భార్య ఆత్మహత్య చేసింది.

Shocking incident: రాజేంద్రనగర్‌లో విషాదం..

హైదరాబాద్, ఆగస్టు 21: రాజేంద్రనగర్‌లోని కిస్మత్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదంటూ భర్త మందలించడంతో.. భార్య ఆత్మహత్య చేసుకుంది. శేఖర్, అరుణ భార్యాభర్తలు. అయితే అరుణ మద్యానికి బానిసైంది. ఆ క్రమంలో తరచూ మద్యం సేవిస్తూ ఉండేది. అయితే భార్యను తరచూ మద్యం తాగడాన్ని నిరోధించేవాడు. ఆ క్రమంలో బుధవారం మద్యం సేవిస్తున్న అరుణను శేఖర్ వారించాడు.


దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. అనంతరం భర్త శేఖర్ పనికి వెళ్లారు. ఆ క్రమంలో మద్యంలో ఎలుకల మందు కలుపుకొని అరుణ సేవించింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయింది. ఈ ఈ విషయాన్ని గమనించిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.


ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా అరుణ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరో వైపు కిస్మత్‌పూర్ గ్రామంలో బెల్ట్ షాపులు అధికమైనాయంటూ స్థానికులు ఆరోపించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కేటీఆర్ కీలక నిర్ణయం.. కవిత లేఖాస్త్రం

భారీ వర్షాలు, వరదలు.. నిలిచిన రాకపోకలు

For More TG News And Telugu News

Updated Date - Aug 21 , 2025 | 12:45 PM