Flight Delay: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిలిచిన విమానం.. ప్రయాణికుల ఆగ్రహం
ABN , Publish Date - Feb 05 , 2025 | 10:35 AM
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. వారు వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిచిపోయింది. అయితే విమానం నిలిచిపోయిన విషయాన్ని ప్రయాణికులకు చెప్పడంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 5: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో (Shamshabad Airport) ఓ విమానం నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే విమానాన్ని ఎయిర్‌పోర్టు అధికారులు నిలిపివేశారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం నిలిచిపోయింది. అయితే విమానం నిలిచిపోవడంతో ప్రయాణికులు సమాచారం ఇవ్వడంలో ఎయిర్‌పోర్టు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అప్పటి వరకు విమానం కోసం వేచి చూస్తున్న ప్రయాణికులకు చివరి నిమిషంలో అక్కడి సిబ్బంది చెప్పిన కారణంతో వారు మండిపడిపోతున్నారు.
హైదరాబాద్- తిరుపతి విమానం ఈరోజు ఉదయం 5:30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఇందులో ప్రయాణించేందుకు ప్రయాణికులు అప్పటికే విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే చివరి నిమిషంలో విమానాన్ని నిలిపివేసినట్లు ఎయిర్‌పోర్టు సిబ్బంది ప్రకటించారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి విమానం కోసం నిరీక్షిస్తుంటే చివరి నిమిషంలో ఎయిర్‌పోర్టు సిబ్బంది ఇలా చెప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. దాదాపు నాలుగు గంటలుగా ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి. మొత్తం 47 మంది ఈ విమానంలో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సి ఉంది.
ఉదయం నుంచి వెయిట్ చేస్తుంటే ఎయిర్‌పోర్టు అధికారులు ఇంత ఆలస్యంగా సమాచారం ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. ఎయిర్‌వేస్ తీరుపై తిరుమలకు వెళ్లే ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమయం దాటిపోతుందని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. తిరుపతి దర్శనానికి ముందస్తుగా టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికలు ఆందోళన చెందుతున్నారు. విమానం ఆలస్యం కారణంగా తిరుపతి వెంకన్న దర్శనం అవుతుందా లేదా అనే సందిగ్ధంలో పడిపోయారు ప్రయాణికులు. తొలుత సాంకేతి లోపం కారణంగా కాస్త ఆలస్యంగా విమానం బయలుదేరుతుందని సమాచారం ఇవ్వడంతో విమానం కోసం ప్రయాణికులు ఎదురుచూస్తుండగా.. మరికాస్త ఆలస్యం అంటూ మరోసారి సమాచారం ఇవ్వడంతో ప్రయాణికులు ఆగ్రహించారు. అయితే ఈ వ్యహారంపై స్పందించిన ఎయిర్‌పోర్టు అధికారులు.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా విమానాన్ని నిలిపివేసినట్లు తెలిపారు. టెక్నికల్ టీం సాంకేతిక లోపాన్ని సరిచేస్తున్నారని.. మరికొద్దిసేపట్లో విమానం తిరుపతికి బయలుదేరుతుందని ఎయిర్‌పోర్టు అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి...
BRS: బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. ఆ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం
Read Latest Telangana News And Telugu News