Share News

Shalibanda Fire Accident: శాలిబండ అగ్నిప్రమాద ఘటన.. సంచలన విషయాలు బయటపెట్టిన డ్రైవర్

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:05 AM

శాలిబండ గోమతి ఎలక్ట్రానిక్స్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కారు డ్రైవర్ మణికంఠ సంచలన విషయాలు బయటపెట్టారు. దీంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Shalibanda Fire Accident: శాలిబండ అగ్నిప్రమాద ఘటన.. సంచలన విషయాలు బయటపెట్టిన డ్రైవర్
Shalibanda Fire Accident

హైదరాబాద్, నవంబర్ 25: శాలిబండ గోమతి ఎలక్ట్రానిక్స్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై మొగల్‌పురా పోలీసులు, విద్యుత్‌ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మణికంఠను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో కారు డ్రైవర్ సంచలన విషయాలు బయటపెట్టారు. రాత్రి 10:30 గంటలకు ఏదో పెద్ద బ్లాస్ట్ అయినట్టుగా ఒక్కసారిగా శబ్దం వినిపించిందని.. శబ్దం రావడంతో తన కారు పల్టీ కొట్టిందని తెలిపారు. కారుకు సంబంధించిన గ్లాస్ మొత్తం కూడా ధ్వంసం అయిపోయిందన్నారు.


shalibanda-fire-1.jpg

కార్‌లో తాను ఒక్కడినే ఉన్నానని.. కార్ ముందు అద్దాలను పగలగొట్టి బయటపడినట్లు తెలిపారు. కారు నుంచి బయటకు వచ్చిన వెంటనే పూర్తిగా కాలిపోయిందని చెప్పారు. కారులో సీఎన్జీ సిలిండర్ ఏమి పేలలేదని స్పష్టం చేశారు. ఎవరెస్ట్ ఫ్లీట్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ (M/S EVEREST FLEET COMPANY PRIVATE LIMITED) అనే కంపెనీ పేరుతో ఉబర్ డ్రైవర్‌గా ఉబర్ నడుపుతున్నట్లు వెల్లడించారు. చార్మినార్ దగ్గర ప్యాసింజర్స్‌ను డ్రాప్ చేశానని... మరో పికప్ శాలిబండ సైడ్ పడిందని అందుకే అక్కడికి బయలుదేరినట్లు తెలిపారు. ఈ క్రమంలో గోమతి ఎలక్ట్రానిక్ షాప్ దగ్గర భారీ శబ్దం వచ్చిందని.. ఎలా వచ్చిందో తెలియదని.. వెంటనే తన కారు కూడా బోల్తా పడిందని డ్రైవర్ మణికంఠ పేర్కొన్నారు.

shalibanda-fire-2.jpg


ఆ కోణంలో దర్యాప్తు...

అయితే.. ప్రమాదంపై డ్రైవర్ కొత్త అంశం చెప్పడంతో షాప్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదం చోటు చేసుకుందా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు ప్రమాదంపై ఎలాంటి క్లారిటీ లేని పరిస్థితి. దీంతో అన్ని కోణాల్లోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

shalibanda-fire-3.jpg


shalibanda-fire-4.jpg

ఇవి కూడా చదవండి...

ఆ లింక్‌లు తెరిచారో... ఇక మీ పని అయిపోయినట్లే...

కత్తులతో ఇంటి యజమానిని భయపెట్టాలని చూశాడు.. చివరకు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 25 , 2025 | 11:25 AM