Masthan Sai: మస్తాన్ సాయికి 14 రోజుల రిమాండ్
ABN , Publish Date - Feb 15 , 2025 | 03:58 PM
Masthan Sai: మస్తాన్ సాయికి రంగారెడ్డి కోర్టు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో మస్తాన్ సాయిని మూడు రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. నేటితో కస్టడీ పూర్తి కావడంతో మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: నగ్న వీడియోలు, డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయికి (Masthan Sai Case) కోర్టు రిమాండ్ విధించింది. మస్తాన్ సాయికి రంగారెడ్డి కోర్టు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో మస్తాన్ సాయిని మూడు రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. నేటితో కస్టడీ పూర్తి కావడంతో మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రంగారెడ్డి కోర్టు న్యాయమూర్తి ఎదుట అతడిని పోలీసులు హాజరపర్చారు. ఈ క్రమంలో 14 రోజుల పాటు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో మస్తాన్ సాయిని చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు.
కాగా.. మూడు రోజుల కస్టడీ విచారణలో కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 45 మందికి పైగా అమ్మాయిల ప్రైవేటు వీడియోలు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో ఉన్నట్లు గుర్తించారు. అలాగే మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన డ్రగ్స్ పార్టీలపై కూడా కస్టడీలో విచారించారు పోలీసులు. కేవలం నార్సింగ్ పోలీసులతో పాటు నార్కోటిక్ పోలీసులు కూడా డ్రగ్స్ వ్యవహారంలో విచారణ జరిపి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. డ్రగ్స్ పార్టీకి సంబంధించి వీడియోలో ఉన్న వారందరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారందరి కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
జైల్లో వల్లభనేని వంశీ చిందులు.. పోలీసులు సీరియస్.. ఏం చేశారంటే..
గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
Read Latest Telangana News And Telugu News