Hyderabad Student Suicide: పేట్ బషీరాబాద్ కేసు... రిమాండ్‌కు విద్యార్థిని పెదనాన్న
ABN , Publish Date - Oct 04 , 2025 | 01:55 PM
ఆరు నెలల క్రితమే విద్యార్థిని తండ్రి మరణించాడు. తండ్రి చనిపోయిన తర్వాత 5 స్టార్ ఫైనాన్స్ వాళ్ళు అప్పు చెల్లించాలని పెదనాన్న మీద ఒత్తిడి తీసుకొచ్చారని.. దీంతో పెద్దనాన్న తమను డాక్యుమెంట్ల కోసం వేధిస్తున్నాడంటూ చనిపోయే ముందు మృతురాలు సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
హైదరాబాద్, అక్టోబర్ 4: నగరంలోని పేట్ బషీరాబాద్ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మృతురాలి పెదనాన్న శ్రీనివాస్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఫైనాన్స్ వేధింపులతో పాటు, తమ పెద్దనాన్న శ్రీనివాస్ అప్పు తీర్చాలని వేధిస్తున్నాడని నిన్న (శుక్రవారం) ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆరు నెలల క్రితమే విద్యార్థిని తండ్రి మరణించాడు. తండ్రి చనిపోయిన తర్వాత 5 స్టార్ ఫైనాన్స్ వాళ్ళు అప్పు చెల్లించాలని పెదనాన్న మీద ఒత్తిడి తీసుకొచ్చారని.. దీంతో పెద్దనాన్న తమను డాక్యుమెంట్ల కోసం వేధిస్తున్నాడంటూ చనిపోయే ముందు మృతురాలు సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
‘రోజూ మా పరువు పోతుంది, అమ్మ ఒక్కతే ఇన్ని అప్పులు చెల్లించలేదు. అందుకే చనిపోతున్నా’ అంటూ సూసైడ్ నోట్ రాసింది. లెటర్‌లో పెద్దనాన్నపై ఆరోపణలు చేయడంతో శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
నేడు తుంగతుర్తిలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు
వామ్మో.. హైడ్రా కూల్చివేతలు మళ్లీ..
Read Latest Telangana News And Telugu News