Share News

Panchayat Elections: పంచాయితీ ఎన్నికలపై ప్రభుత్వం తర్జన భర్జన

ABN , Publish Date - Jan 29 , 2025 | 04:07 PM

TG Govt: పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం తర్జన భర్జనకు గురవుతోంది. కులగణను సంబంధించిన ముసాయిదా సిద్ధమైనప్పటికీ ఇంకా ఫైనల్ రిపోర్టును డెడికేషన్ కమిషన్ ఇవ్వలేదు. ఫిబ్రవరి 2 లోపు కేబినెట్ సబ్ కమిటీకి అందిస్తామని డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి తెలిపింది.

Panchayat Elections: పంచాయితీ ఎన్నికలపై ప్రభుత్వం తర్జన భర్జన
Panchayat Elections

హైదరాబాద్, జనవరి 29: పంచాయితీ ఎన్నికలపై (Panchayat Elections) తెలంగాణ ప్రభుత్వం తర్జనభర్జనకు గురవుతోంది. డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణకు వెళ్లాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 2లోపు డెడికేషన్ కమిషన్ రిపోర్టు ఇవ్వనుంది. రిపోర్టు వచ్చిన తర్వాత మరోసారి అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు ఫిబ్రవరిలోనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (బుధవారం) సమీక్ష నిర్వహించారు.


ఈ సమావేశానికి రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే గురించి చర్చించారు. ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులను సీఎం అభినందించారు. అయితే ఈ సమావేశంలో పంచాయితీరాజ్ ఎన్నికలపై ఓ నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. కానీ పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం తర్జన భర్జనకు గురవుతోంది. కులగణను సంబంధించిన ముసాయిదా సిద్ధమైనప్పటికీ ఇంకా ఫైనల్ రిపోర్టును డెడికేషన్ కమిషన్ ఇవ్వలేదు. ఫిబ్రవరి 2 లోపు కేబినెట్ సబ్ కమిటీకి అందిస్తామని డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి తెలిపింది.

ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా.. షెడ్యూల్ ఇదే..


ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2 తరువాత మరోసారి సమావేశమై పంచాయతీ ఎన్నికలపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. రిజర్వేషన్లపై పాత పద్ధతిలోనే వెళ్లాలా లేక న్యాయ స్థానాలలో పెంచుకునే అవకాశం పొందాలా అనేదానిపై సర్కార్ తర్జన భర్జనకు గురవుతోంది. న్యాయ నిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పంచాయితీల్లో గతేడాది 2024, ఫిబ్రవరి1న సర్పంచ్ పదవీకాలం ముగియగా.. ప్రత్యేక అధికార పాలన వచ్చింది. రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 15 రోజుల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి...

High Court: ఉస్మానియా ఆస్పత్రిని తరలిస్తే తప్పేంటి..

జగన్ హయాంలో పాఠశాలల బాగు ఉత్తుత్తే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 29 , 2025 | 04:08 PM