Share News

Operation Abhyas: హైదరాబాద్‌లో ఆపరేషన్ అభ్యాస్.. మోగనున్న సైరెన్లు

ABN , Publish Date - May 07 , 2025 | 03:58 PM

Operation Abhyas Hyderabad: దేశ వ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరుతో ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.

Operation Abhyas: హైదరాబాద్‌లో ఆపరేషన్ అభ్యాస్.. మోగనున్న సైరెన్లు
Operation Abhyas Hyderabad

హైదరాబాద్, మే 7: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ అభ్యాస్’ (Operation Abhyas) నిర్వహిస్తున్నామని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ మాక్ డ్రిల్‌లో భాగంగా ప్రజలకు జాగ్రత్తలు, సూచనలు చేస్తామన్నారు. అత్యవసర పరిస్థితులపై అప్రమత్తం చేసేందుకే మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్‌లోని 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని.. వీటిలో నానల్ నగర్, కంచన్ బాగ్, సికింద్రాబాద్‌ ఉన్నాయన్నారు. ఈసీఐఎల్ ఎన్ఎఫ్‌సీ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు సీపీ తెలిపారు. రెండు నిమిషాల పాటు సైరన్ మోగుతుందన్నారు. సైరన్ మోగగానే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సీపీ తెలిపారు. సైరన్ మోగినప్పుడు ఇంట్లో ఉన్నవారు ఇంట్లోనే ఉండాలని.. బయట ఉన్నవారు సమీప భవనాల్లోకి వెళ్లాలన్నారు. వాహనాలపై ఉన్నవారు సమీప షెల్టర్లలోకి వెళ్లాలని సీవీ ఆనంద్ తెలిపారు.


ఆపరేషన్ సింధూర్ అప్రమత్త చర్యల్లో భాగంగా నిన్న కేంద్ర హోం శాఖ విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని తెలిపారు. ఆపరేషన్ అభ్యాస్ ప్రారంభించాలని చెప్పారని, ప్రజలను అప్రమత్తం చేయడానికి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేలా సన్నాహక చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. అన్ని డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన అధికారులు భేటీ అయ్యి మాక్ డ్రిల్‌పై చర్చించినట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీలో నాలుగు ప్రాంతాలలో మాక్ డ్రిల్ జరుగుతుందని తెలిపారు. సీఎం రేవంత్ నేడు భద్రతపై సమీక్ష నిర్వహించారని. మాక్ డ్రిల్ కోసం ఐసీసీసీ నోడల్ సెంటర్‌‌గా వ్యవహరిస్తుందన్నారు. 4 గంటలకు ఐసీసీసీ నుంచి ఒక అలెర్ట్ వస్తుందని.. అలెర్ట్ వచ్చాక రెండు నిమిషాలు పాటు సైరన్ మోగుతాయన్నారు. పోలీస్ పెట్రోల్ వెహికల్స్, సైరన్ ఇండస్ట్రియల్ సరిమడ్ రెండు నిమిషాలు మోగుతాయని వెల్లడించారు.


వాహనాలపై ప్రయాణం చేసి వారు వాహనాలు ఆపి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని సూచించారు. ఐసీసీసీ నుంచి 15 నిమిషాల తర్వాత మరోసారి సైరన్ మోగుతోందని... అప్పుడు సైనిక చర్య మొదలు అవుతుందన్నారు. ఈరోజు నుంచి పరిస్థితి సానుకూలంగా మారేదాకా ఉద్యోగుల సెలవులు రద్దు కోసం సీఎం ఆదేశించారని తెలిపారు. ఫేక్ న్యూస్ పట్ల జనాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్ మీడియాపై సైబర్ సెక్యూరిటీ నిఘా ఉంటుందన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితి తలెత్తితే డాక్టర్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఇతర విభాగాలు కూడా అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు పరికరాలు అందుబాటులో ఉంచుకుని యాక్షన్ కోసం సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.


మరికాసేపట్లో మాక్ డ్రిల్..

మరికాసేపట్లో దేశ వ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరుతో ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంపై ఈ మాక్ డ్రిల్‌లో కసరత్తు చేస్తారు. పౌరుల రక్షణ, ప్రాణ నష్టం తగ్గించే చర్యలు తీసుకుంటారు. ఇదే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించనున్నాయి. హైదరాబాద్‌లోని 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. అలాగే విశాఖలో రెండు చోట్ల సివిల్ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.


సరిహద్దు ఉద్రిక్తత వేళ ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేలా ప్రజల్ని సన్నద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం (మాక్ డ్రిల్)నిర్వహించాలని ఆదేశించింది. ఢిల్లీ, మహారాష్ట్ర,హైదరాబాద్, విశాఖపట్నం సహా పలు జిల్లాలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. మూడొందల పైచిలుకు 'సివిల్ డిఫెన్స్ జిల్లాల్లో సైరన్లు మోగనున్నాయి.అణు ఇంధన కర్మాగారాలు, సైనిక స్థావరాలు, చమురుశుద్ధి కర్మాగారాలు, విద్యుదుత్పత్తికి వాడే జలాశయాలు వంటి వాటిని యుద్ధ సమయంలో ఎలా కాపాడుకోవాలనే దానిపై క్షేత్రస్థాయిలో సన్నద్ధత తీసుకురానున్నారు.ప్రజల్ని ఎలా భాగస్వాముల్ని చేయాలనే దానిపై హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో నిన్న (మంగళవారం) ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ విభాగాల అధికారులకు దీనిలో మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులు, ప్రభుత్వ/ ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, ఆసుపత్రుల సిబ్బంది, రైల్వే, మెట్రో అధికారులు, పోలీసులు, పారామిలిటరీ బలాలు, రక్షణ బలగాలు దీనిలో పాల్గొనేలా సూచనలు జారీ అయ్యాయి.


ఇవి కూడా చదవండి

Operation Sindhur: ఆపరేషన్ సింధూర్‌ను పర్యవేక్షించిన.. ప్రధాని మోదీ..

India Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌.. ఈ పేరు పెట్టడానికి అసలు కారణం ఇదే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 07 , 2025 | 04:11 PM