Car on Railway Track: కాచిగూడ రైల్వే ట్రాక్‌పై కారు అడ్డంగా పెట్టి దుండగుడు పరార్..
ABN , Publish Date - Nov 13 , 2025 | 10:00 PM
ఢిల్లీ పేలుళ్లు ఘటన తర్వాత హైదరాబాద్ నగరానికి హైఅలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నగరవ్యాప్తంగా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో భద్రతా సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే..
హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో కారు బాంబు పేలుడు ఘటనతో దేశ ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. అలాంటి వేళ హైదరాబాద్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి చేసిన పని నగరవాసులను ఆందోళనకు గురి చేసింది. కాచిగూడ రైల్వే ట్రాక్‌కు అడ్డంగా కారు పెట్టి పరారయ్యాడు ఓ అగంతకుడు. ట్రాక్‌పై కారును వదిలి వెళ్లడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. దీంతో రైల్వే ట్రాక్ సమీపంలో పోలీసులు ఆంక్షలు విధించారు. కారులో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
అనంతరం ట్రాక్ పైనుంచి కారును తొలగించారు రైల్వే పోలీసులు. కారు నంబర్ ఆధారంగా బాలాజీ అనే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషనై ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఢిల్లీ పేలుళ్ల ఘటన తర్వాత హైదరాబాద్ నగరానికి హైఅలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నగరవ్యాప్తంగా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో భద్రతా సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. షాపింగ్ మాల్స్, ప్రజల రద్దీ అధికంగా ఉంటే జంక్షన్ల వద్ద పహారా కాస్తున్నారు. అలాంటి వేళ ఇలా కారును రైల్వే ట్రాక్‌పై పెట్టడంతో అంతా బెంబేలెత్తిపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఎవరు, కారును అక్కడ ఎందుకు పెట్టాడు వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. అలాగే కారును సైతం నిశితంగా పరీక్షిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Revanth Reddy: USISPF సమ్మిట్.. సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే..
Telangana Government: టీచర్లకు ప్రభుత్వం షాక్..