Share News

Hyderabad Kidnap: వాకింగ్‌కు వెళ్తున్న వ్యక్తి కిడ్నాప్.. ఏం జరిగిందంటే

ABN , Publish Date - Oct 09 , 2025 | 09:57 AM

ఈ నెల 6న మనోజ్ కుమార్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి మాతృశ్రీనగర్‌లో వాకింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మనోజ్ కుమార్‌కు వెంకటస్వరూప్ అనే వ్యక్తి తారసరపడ్డాడు.

Hyderabad Kidnap: వాకింగ్‌కు వెళ్తున్న వ్యక్తి కిడ్నాప్.. ఏం జరిగిందంటే
Hyderabad Kidnap

హైదరాబాద్, అక్టోబర్ 9: నగరంలో వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపుతోంది. వాకింగ్‌కు వెళ్తున్న ఓ వ్యక్తిని దుండగులు కిడ్నాప్ చేశారు. తుపాకీతో బెదిరించి మరీ 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు కిడ్నాపర్లు. బాధితుడు మనోజ్ కుమార్‌గా గుర్తించారు. అతడి భార్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మధురానగర్ పోలీసులు.. నిందితులను ట్రాప్ చేసి అరెస్టు చేశారు.


ఈ నెల 6న మనోజ్ కుమార్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి మాతృశ్రీనగర్‌లో వాకింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మనోజ్ కుమార్‌కు వెంకటస్వరూప్ అనే వ్యక్తి తారసరపడ్డాడు. మనోజ్‌కు మాయ మాటలు చెప్పి కారులో అమీర్‌పేటలో ఉన్న తన కార్యాలయానికి తీసుకువెళ్లిన వెంకటస్వరూప్. ఆపై 10 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ వెంకట స్వరూప్‌తో పాటు మరో ఐదుగురు మనోజ్ కుమార్‌పై దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా మనోజ్ కుమార్ భార్యకు ఫోన్ చేసి డబ్బు చెల్లించకపోతే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు.


దీంతో భయాందోళనకు గురైన మనోజ్ కుమార్ భార్య వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం విస్తృతంగా గాలించారు. చివరకు వారిని ట్రాప్ చేసి నిందితుల్లో ముగ్గురిని అమీర్‌పేట్‌లో అరెస్ట్ చేశారు పోలీసులు. పరారీలో ఉన్న మరో ఇద్దరు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తానికి కిడ్నాప్‌కు గురైన వ్యక్తి సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.


ఇవి కూడా చదవండి..

చలో బస్ భవన్.. బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 09 , 2025 | 10:08 AM