Share News

BRS Protest: చలో బస్ భవన్.. బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్ట్

ABN , Publish Date - Oct 09 , 2025 | 09:24 AM

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే వివేకానంద గౌడ్, శంభీర్ పూర్ రాజు, సాయుబాబా తదితరులను కూడా గృహనిర్బంధం చేశారు పోలీసులు.

BRS Protest: చలో బస్ భవన్.. బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్ట్
BRS Protest

హైదరాబాద్, అక్టోబర్ 9: పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు (గురువారం) చలో బస్‌ భవన్‌కు బీఆర్‌ఎస్ (BRS) పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు గులాబీ నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు‌ను (MLA Madhavaram Krishna RAo) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే వివేకానంద గౌడ్, శంభీర్ పూర్ రాజు, సాయుబాబా తదితరులను కూడా గృహనిర్బంధం చేశారు పోలీసులు.


ఇక మాజీ మంత్రి , మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని (MLA Sabita Indra Reddy) కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెంచిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని చలో బస్ బవన్ కార్యక్రమానికి బయలుదేరుతున్న సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు అడ్డుకొని గృహనిర్బంధం చేశారు. అంతేకాకుండా... బీఆర్‌ఎస్ బస్ భవన్ పిలుపు నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బస్ భవన్ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.


మరోవైపు చలో బస్ భవన్‌లో భాగంగా మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) ఇంటి నుంచి బయలుదేరారు. ముందుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటికి చేరుకుని అక్కడి నుంచి సికింద్రాబాద్ బస్ స్టేషన్ నుంచి బస్‌ భవన్‌కు కేటీఆర్ వెళ్లనున్నారు. ఇక హరీష్ రావు.. మెహదీపట్నంలో బస్ ఎక్కి బస్ భవన్‌కు చేరుకోనున్నారు.


ఇవి కూడా చదవండి..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో 9పై ఇవాళ హైకోర్టు తీర్పు

Yadadri Bhongir Road Accident: యాదాద్రి రామన్నపేటలో కంటైనర్ బీభత్సం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 09 , 2025 | 09:33 AM