Share News

Bomb threat flights in Hyderabad: హైదరాబాద్ వస్తున్న ఆ విమానాలకు బాంబు బెదిరింపులు.!

ABN , Publish Date - Dec 06 , 2025 | 09:10 AM

విమానాలకు మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. అప్రమత్తమైన అధికారులు.. ఆయా విమానాలను దారి మళ్లించారు. ఎయిర్‌పోర్టు పరిధిలో కట్టుదిట్టమైన భద్రను ఏర్పాటుచేశారు అధికారులు.

 Bomb threat flights in Hyderabad: హైదరాబాద్ వస్తున్న ఆ విమానాలకు బాంబు బెదిరింపులు.!
Bomb threat flights Hyderabad

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ విమానాల్లో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం చోటు చేసుకుంది(Bomb Threats in Hyderabad Airport). హైదరాబాద్ వస్తున్న కువైట్-శంషాబాద్(Kuvait-Shamshabad), బ్రిటీష్ ఎయిర్‌లైన్స్(British Airlines) ఫ్లైట్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. మెయిల్ ద్వారా వచ్చిన ఈ బెదిరింపుతో అధికారులు అప్రమత్తమై.. హెలిప్యాడ్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. మరోవైపు బాంబు స్క్వాడ్, పోలీసులు ఎయిర్‌పోర్టు పరిసరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

దీంతో కువైట్ - శంషాబాద్ విమానాన్ని మస్కట్ వైపునకు మళ్లించారు విమానయాన అధికారులు. అలాగే.. లండన్ నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ విమానం క్షేమంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది.


బాంబు బెదిరింపు విషయం బయటకు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే.. శుక్రవారం కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport)కు ఒకసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. అసలు ఈ బెదిరింపులకు కారణం ఏంటి? ఎవరీ ఘాతుకానికి పాల్పడుతున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శనివారం మరోసారి బెదిరింపుల కలకలం రేగడంతో.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలో కట్టుదిట్టమైన భద్రను ఏర్పాటుచేశారు అధికారులు.


ఇవీ చదవండి:

కూడలి కుదింపు వేగవంతం

రూ. కోట్లు మట్టిపాలు...!

Updated Date - Dec 06 , 2025 | 09:19 AM