Share News

KTR: అందరూ అలాగే అనుకోవడంతో కేసీఆర్ సీఎం కాలేకపోయారు: కేటీఆర్

ABN , Publish Date - Sep 24 , 2025 | 05:11 PM

కరీంనగర్ కు చెందిన ప్రముఖ డాక్టర్ దంపతులు రోహిత్ రెడ్డి, గౌతమి రెడ్డిని కేటీఆర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో వారిద్దరికీ గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.

KTR: అందరూ అలాగే అనుకోవడంతో కేసీఆర్ సీఎం కాలేకపోయారు: కేటీఆర్
KTR on BJP Karimnagar

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేజిక్కించుకోకపోవడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలంతా స్థానికంగా ఉన్న తమ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయినా.. కేసీఆర్ మాత్రం మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నారని తెలిపారు. అయితే, అందరూ అలాగే అనుకోవడంతో కేసీఆర్ సీఎం కాలేకపోయారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. బంగారుపల్లెంలో పెట్టి ఇచ్చిన తెలంగాణను కాంగ్రెస్ నేతలు ఆగమాగం చేశారని మండిపడ్డారు.

దేవుని పేరు చెప్పి ఓట్లు వేసుకోవడం ఒక్కటే బీజేపీకి తెలుసన్న కేటీఆర్.. దేవుని పేరు చెప్పారనే కరీంనగర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థిని గెలుపించారని అన్నారు. కాంగ్రెస్ దొంగ మాటలు హైదరాబాద్ ప్రజలు నమ్మలేదని.. కానీ ఊళ్లలో నమ్మి మోసపోయారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.


కాగా, ఇవాళ(బుధవారం) కరీంనగర్ కు చెందిన ప్రముఖ డాక్టర్ దంపతులు రోహిత్ రెడ్డి, గౌతమి రెడ్డిని కేటీఆర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో వారిద్దరికీ గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. 'కరీంనగర్ లో ఒక్క బడి తేలేదు.. కనీసం గుడి కూడా తేలేదు. అయినా కరీంనగర్ వాళ్లు బీజేపీకే ఓటు వేస్తున్నారు.

బీజేపీ మోసం రాముడికి కూడా అర్థం అయింది. అందుకే అయోధ్యలో బీజేపీని ఓడగొట్టారు. కానీ కరీంనగర్ లో మాత్రం బీజేపీనే గెలిపిస్తున్నారు' అని కేటీఆర్ అన్నారు. అవసరం లేకున్నా వేసిన జీఎస్టీని ఎత్తేసి కేంద్రం పండుగ చేసుకోండి అంటుంది. మోదీ ఇచ్చిన పదిహేను లక్షలు హామీ ఏమయ్యింది? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్

అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు

For More AP News And Telugu News

Updated Date - Sep 24 , 2025 | 06:13 PM