Kancha Gachibowli land Issue: ఇకనైనా సోయి తెచ్చుకోండి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ విసుర్లు
ABN , Publish Date - Apr 16 , 2025 | 02:29 PM
Kancha Gachibowli land Issue: సుప్రీంకోర్టు ఉత్తర్వులు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ పర్యావరణ పరిరక్షణకు గొప్ప ఊతమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. గొంతులేని మూగజీవాల కోసం, చెట్ల కోసం, పర్యావరణం కోసం అండగా నిలబడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్, ఏప్రిల్ 16: కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాలను బీఆర్‌ఎస్ హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతోందన్నారు. కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అడవులను పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌కు వన్యప్రాణులను కాపాడాలంటూ ఆదేశాలు ఇవ్వడం గొప్ప విజయమన్నారు. వన్యప్రాణుల పట్ల, పర్యావరణ పరిరక్షణకు పాటుపడే ప్రతి ఒక్కరికి దక్కిన విజయం ఇదన్నారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ పర్యావరణ పరిరక్షణకు గొప్ప ఊతమని చెప్పుకొచ్చారు. గొంతులేని మూగజీవాల కోసం, చెట్ల కోసం, పర్యావరణం కోసం అండగా నిలబడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. 400 ఎకరాల కంచ గచ్చిబౌలి అడవిని కాపాడి, హైదరాబాద్ భవిష్యత్తు కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికారిక కమిటీ ఇచ్చిన సిఫార్సులను కూడా బీఆర్‌ఎస్ స్వాగితిస్తోందన్నారు.
Faheem Fake Letter Controversy: సీఎంకు చెడ్డ పేరు వచ్చేలా చేయను.. చేయబోను
కంచ గచ్చిబౌలిని ప్రైవేట్ పార్టీకి తాకట్టు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వ వ్యవహారంలో ఆర్థిక అవకతవకలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన కేంద్ర సాధికారిక కమిటీ తమ పార్టీ వాదనను బలపరుస్తోందన్నారు. కంచ గచ్చిబౌలి భూముల తాకట్టు విషయంలో పదివేల కోట్ల రూపాయల అవినీతికి రేవంత్ రెడ్డి పాల్పడ్డారని చేసిన ఆరోపణలను మంత్రి పునరుద్ఘాటించారు. అడవుల పట్ల, వన్యప్రాణుల పట్ల రేవంత్ రెడ్డి నెంబర్ వన్ విలన్‌గా మారారని విమర్శించారు. పర్యావరణ విధ్వంసానికి, పర్యావరణ హత్యకు పాల్పడి తప్పించుకోలేరనే కనీస సోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇకనైనా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తనను తాను మోసం చేసుకున్న విషయాన్ని అర్థం చేసుకుని పర్యావరణ విధ్వంసం ఆపాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు.
ఇవి కూడా చదవండి
Supreme Court: సెలవుల్లో బుల్డోజర్లు దింపాల్సిన అవసరం ఏంటి.. సర్కార్‌కు సుప్రీం సూటి ప్రశ్న
AP Fiber Net: ఏపీ ఫైబర్‌నెట్‌లో ఉద్యోగులపై సర్కార్ షాకింగ్ డెసిషెన్
Read Latest Telangana News And Telugu News