Share News

Chakalilamma University: చాకలి ఐలమ్మ వర్సిటీలో లైంగిక వేధింపులపై ప్రిన్సిపాల్ ఏమన్నారంటే?

ABN , Publish Date - Dec 15 , 2025 | 02:51 PM

విద్యార్థులు ఏవైనా సమస్యలు ఉంటే తమకు చెప్పాలని చాకలి ఐలమ్మ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ లోక పావని అన్నారు. లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు ఎవరో తెలియదని చెప్పారు.

Chakalilamma University: చాకలి ఐలమ్మ వర్సిటీలో లైంగిక వేధింపులపై ప్రిన్సిపాల్ ఏమన్నారంటే?
Chakalilamma University

హైదరాబాద్, డిసెంబర్ 15: కోఠిలోని చాకలి ఐలమ్మ యూనివర్సిటీ‌లో (Chakalilamma Universit) లైంగిక వేధింపుల ఆరోపణలపై వర్సిటీ ప్రిన్సిపాల్ లోక పావని స్పందించారు. సోమవారం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో (ABN- Andhrajyothy) ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులపై వేధింపులు జరిగాయని స్థానిక పోలీసులు నిన్న సమాచారం అందించారని.. వేధింపులపై హాస్టల్ వార్డెన్‌కు, ప్రిన్సిపాల్‌కు విద్యార్థులు గతంలో ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని తెలిపారు. మెస్ ఇంచార్జ్ వినోద్‌పై గతంలో ఎలాంటి ఆరోపణలు లేవని అన్నారు. లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు ఎవరో తెలియదని చెప్పారు.


ఫిర్యాదు చేసిన విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోని టార్గెట్ చెయ్యమని స్పష్టం చేశారు. విద్యార్థులకు సమస్యలుంటే మొదటగా తమకు చెప్పాలని కోరారు. మెస్ ఇంచార్జ్ వినోద్ తప్పు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసులతో పాటు యూనివర్సిటీ నుంచి ప్రత్యేక కమిటీని వేసి విచారిస్తున్నామన్నారు. విద్యార్థులు అభద్రతా భావానికి గురి కావద్దని సూచించారు.


యూనివర్సిటీ, హాస్టల్ మెస్‌లో విద్యార్థుల వసతులకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. హాస్టల్‌లో తక్కువ స్థలంలో ఎక్కువ మంది విద్యార్థులు వసతి ఉంటున్నారని తెలిపారు. సీసీ కెమెరాలు కొరత వేధిస్తోందని చెప్పారు. ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా వర్సిటీ ప్రిన్సిపాల్ లోక పావని కోరారు.


ఇవి కూడా చదవండి..

ఓడిపోయిన అభ్యర్థిని ట్రాక్టర్‌‌తో ఢీకొట్టిన సర్పంచ్ తమ్ముడు.. ఏం జరిగిందంటే

ఈ ఎన్నికల ఫలితాలు రేవంత్‌కు చెంపపెట్టు.. కేటీఆర్ సంచలన ట్వీట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 15 , 2025 | 03:36 PM