Alaknanda Hospital: కిడ్నీ రాకెట్ కేసులో కీలక మలుపు
ABN , Publish Date - Jan 23 , 2025 | 07:15 PM
Alaknanda Hospital: సరూర్ నగర్‌లోని కిడ్నీ రాకెట్ కేసు వ్యవహారంలో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ రాకెట్‌లో బెంగళూరుకు చెందిన వైద్యుడు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్, జనవరి 23: సరూర్ నగర్‌లోని అలకనంద ఆసుపత్రి వేదికగా జరిగిన కిడ్నీ రాకెట్ కేసులో కీలక మలుపు చోటు చేసుకొంది. ఈ కేసులో 8 మంది బ్రోకర్లను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. గత ఆరు నెలలుగా ఈ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతోన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన వైద్యుడు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తమ దర్యాప్తులో వివరాలు సేకరించారు. ఈ కిడ్నీ ఆపరేషన్ కేసులో పోలీసులు తమ దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.
అందులోభాగంగా ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు కీలక పాత్ర పోషించారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ కేసులో ఇప్పటికే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అలకనంద ఆసుపత్రి చైర్మన్ సుమంత్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని దళారులు ఈ దారుణానికి బరి తెగించినట్లు వైద్య శాఖ అధికారుల విచారణలో బహిర్గతమైంది.
దాదాపు 5 గంటలపాటు బాధితులతో సైతం వైద్య అధికారులు మాట్లాడారు. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించి డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం.. ప్రభుత్వానికి కీలక నివేదిక సమర్పించిందని తెలుస్తోంది.
సరూర్ నగర్‌లోని అలకనంద ఆసుపత్రిలో అనుమతులు లేకుండా కిడ్నీ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారంటూ ప్రభుత్వ ఉన్నతాధికారులు తాజాగా ఆంగతకులు సమాచారం అందించారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు ఆలకనంద ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో పలువురు కిడ్నీలు దానం చేసిన వారితోపాటు కిడ్నీలు అమర్చిన వారిని గుర్తించారు.
Also Read: ఐటీ దాడులు.. మహిళా అధికారితో వాదన.. దిల్ రాజు సీరియస్
Also Read: తక్కువ పెట్టుబడితో.. రోజుకు రూ.10 వేలు లాభం
దాంతో వారిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆసుపత్రిలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో ఆసుపత్రి సిబ్బందిని సైతం ఉన్నతాధికారులు ప్రశ్నించారు. వారి నుంచి పలు అంశాలకు సంబంధించి పలు కీలక సమాధానాలను ఉన్నతాధికారులు రాబట్టారు. అలాగే కిడ్నీ శస్త్ర చికిత్సలు చేయించుకొన్న వారిని సైతం ఉన్నతాధికారులు కలిశారు. వారి నుంచి కూడా సమాధానాలు రాబట్టారు.
Also Read: వాతావరణ శాఖ కీలక అలర్ట్.. రిపబ్లిక్ డే వరకు..
Also Read: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
అయితే ఈ కేసులో పలువురు బ్రోకర్ల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే బ్రోకర్లతోపాటు బెంగళూరుకు చెందిన వైద్యుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేట్టారు. అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
For Telangana News And Telugu News